నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజించి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓ పూచిక పుల్లగా చూసిన కాంగ్రెసు అధిష్టానానికి గుణపాఠం నేర్పిన అభిమాన ధనుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి త్యాగాన్ని, తెగువని, ధైర్యాన్ని సీమాంధ్రులు గుర్తించకపోయినా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుర్తించారు. తనకోణం నుంచి విషయాన్ని సమీక్షించారు. ఆంధ్రాలో కాంగ్రెసుని పాతేసింది కిరణ్‌కుమార్ రెడ్డి అని, ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని నామినేట్ చేసి పొరపాటు చేశానని రాహుల్ గాంధీ చింతించారు. అదే సమయంలో కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని పంపిన ‘రాయలసీమ రత్నం’ కిరణ్ కుమార్ రెడ్డి. వేరొకరయితే ‘అధిష్టానం ఆదేశించింది’ అంటూ వ్రేలిముద్రవేసి గవర్నరుగిరీకి బేరం పెట్టేవారు. కాంగ్రెసు చరిత్రలో అధిష్టానానికి ఇలా అడ్డం తిరిగినవారు ఒకరిద్దరే కనిపిస్తారు. కిరణ్‌కుమార్ రెడ్డి క్రెడిబిలిటీ వున్న నాయకుడు. ఇటువంటి నిఖార్సయిన నాయకుడ్ని బిజెపి ఆహ్వానిస్తే బాగుండేది, కేంద్రమంత్రి పదవిని అనుభవించి ఆఖరి నిమిషంలో రాజీనామా చేసిన వారిని బిజెపి పార్టీలో చేర్చుకుని పొరపాటు చేసింది. రాహుల్ వ్యాఖ్యలు విమర్శలు కాదు, ప్రశంసలుగానే కిరణ్‌కుమార్‌రెడ్డి స్వీకరించాలి!