మే 8న ఎంసెట్. గత రెండేళ్ళుగా ఇంటర్ విద్యార్ధులు ఏ పరీక్షకోసం అహరహరం కృషి చేశారో ఆ పరీక్ష వచ్చేసింది. ఇహ మిగిలింది అమ్మ ఒడి మాత్రమే. పరీక్ష పూర్తికాగానే అమ్మ ఒడిలో వాలిపోవాలని, రెండేళ్ళ తర్వాత కంటినిండా నిద్రపోవాలని, అమ్మ చేతి గోరు ముద్దలు తినాలని కోరుకుంటున్నారు. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వలన ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. పరీక్షా కేంద్రాలకు వెళ్ళడానికే నానా అవస్తలు పడుతున్నారు. దీనికి తోడు బండలు పగిలే ఎండలు. నీటి ఎద్దడి. కరెంటు కోత. ఇద్దరు ముఖ్యమంత్రులు చేయలేనిది తెలుగుదేశం పార్టీ ఎంపీలయిన కేశినేని నానిగారు, జెసి దివాకరరెడ్డి గారు చొరవ తీసుకొని తమ ట్రావెల్స్ బస్సులను సేవా భావంతో వినియోగించాలి. తమ బస్సులనేకాదు మిత్ర సంస్థల బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్ విద్యార్ధులను ఆదుకోవాలి. ఇది సేవా కార్యక్రమంగా భావించి సమస్త వనరుల్ని వినియోగించాల్సిన సమయమిది.