కాంగ్రెసు, టిడిపి, ఉభయ కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేస్తున్నారు. ప్రత్యేక హోదా కొరకు సినీ నటుడు శివాజీ నిరాహార దీక్ష చేపట్టాడు. శివాజీ దీక్షకు ఈ రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం లేదు. తాము చేయలేని పనిని వేరొకరు చేస్తుంటే వారిని అభినందించడానికి, మద్దతు తెలపడానికి వీరికి అభ్యంతరమేమిటి? వాస్తవానికి శివాజీకి బిజెపి సభ్యత్వం లేదు. గతంలో మోదీ అభిమానిని అని చెప్పుకున్నాడు. అంతే. శివాజీ తమ పార్టీ సభ్యుడయితేనే ఈ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయా? వ్యక్తిగా శివాజీ చేసే పోరాటం క్రెడిట్ తమ పార్టీకి దక్కాలని వీరంతా తాపత్రయపడుతున్నారా? ఇంతకీ వీరికి కావలసింది ప్రత్యేక హోదానా లేక పార్టీ క్రెడిటా? ఇంతకన్నా దగా, ఆత్మ వంచన వేరొకటి లేదు.