నటుడిగా తనకు జన్మనిచ్చిన దర్శకుడి పేరుకు` తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొన్న హీరో పేరు జత చేసి.. తన బిడ్డకు పేరు పెట్టుకొన్నాడతను!!
ఓ ప్రతిభావంతుడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ` తాను హీరోగా మొదలైన సినిమా ఆగిపోవడంతో.. సదరు దర్శకుడికి అవకాశం ఇవ్వడం కోసం తనే నిర్మాతగా అవతారం ఎత్తాడతను!!
‘కృతజ్ఞత’.... మృగాల నుంచి మనుషులను వేరు చేసే ముఖ్య లక్షణాల్లో ఒకటి!
‘మానవత’.... ఇటీవలకాలంలో మనుషుల్లోంచి మాయమైపోతున్న ఓ మంచి లక్షణం!
ఆ రెండు లక్షణాల కలబోత.. ‘ధనరాజ్’ !!
‘జగడం’తో నటుడిగా తనకు జన్మనిచ్చిన సుకుమార్` ‘జగడం’ టైంలో పరిచయమై, తన బ్యాడ్‌టైమ్‌లో తనకు అండగా నిలిచిన రామ్ పేర్లు జత చేసి తన కుమారుడికి ‘సుక్కురామ్’ అనే పేరు పెట్టుకొన్నాడు ధనరాజ్!!
‘ఓ చచ్చినోడి ప్రేమకథ’ పేరుతో మొదలైన ఓ చిత్రం ‘సాయి అచ్యుత్ చిన్నారి’ దర్శకత్వంలో.. తను హీరోగా ఆరంభమై ఆగిపోవడంతో` తన కారణంగా ఒకరి కెరీర్ కిల్ కాకూడదనే ఉద్దేశ్యంతో.. సాయి అచ్యుత్‌ను దర్శకుడ్ని చేయడం కోసం` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రంతో నిర్మాతగా మారాడతను!!
ధనరాజ్ వ్యక్తిత్వానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి?
ఈరోజున సినిమాల ద్వారా, ‘జబర్‌దస్త్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన ధనరాజ్ జీవితంలో సినిమా కష్టాలు.. సినిమాటిక్ సంఘటనలు ఎన్నో..!!
కొన్ని విన్నప్పుడు నిజంగానే ‘ఇవన్నీ’ జరిగాయా? అనిపిస్తుంది ఎవరికైనా!
కానీ జీవితం అంటే అంతే కదా?
‘వాస్తవం’ ఒక్కోసారి కల్పన కంటే విచిత్రంగా ఉండడం సహజమే కదా?
ట్రూత్ ఈజ్ ఆల్వేజ్ స్ట్రెేంజర్ దేన్ ఫిక్షన్!!
మనుషుల్లో ఉండాల్సిన మరో లక్షణం`
తన ‘మూలాలు’ మర్చిపోకపోవడం!
చాలామంది, తాము కొంచెం ఒక స్థాయికి చేరుకోగానే తమ ‘మూలాలు’ ఓ మూలన మడిచి పెట్టేసి, ఎవరి మూలాన తాము పైకి వచ్చామో సైతం కప్పిపుచ్చి` అంతా ‘స్వయంకృషి’గా ‘స్వకుచమర్దనం’ చేసుకొంటారు!!
కానీ.. ధనరాజ్ అలా కాదు.
తాను ఓ హెటల్‌లో ‘సర్వర్’గా పని చేసానని చెప్పుకోవడానికి అతను ఎంత మాత్రం సిగ్గు పడడు!
కన్నీళ్లతో.. కాలే కడుపును చల్లార్చుకొంటూ` నీరసంతో కళ్లు తిరిగేలా.. నిస్సత్తువలో కాళ్లు అరిగేలా తిరిగిన రోజుల్ని మర్చిపోడు!
నిప్పుల కొలిమిలో కాల్చి.. సుతిమెత్తని సుత్తి దెబ్బలు వేయకుండా బంగారం ఆభరణంగా మారదు!!
కష్టాల కొలిమితో చెలిమి చేయకుండా మనిషి వ్యక్తిత్వం రాటుదేలదు!!
ఆశయ సాధనలో ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా` ఆపత్కాలంలో తనకు అండగా నిలిచినవాళ్లను మర్చిపోకుండా` ఎదిగే కొద్దీ ఒదిగిపోతూ.. తన సన్నిహితుల చిట్టాను రోజురోజుకూ పెంచుకొంటూ
వెళుతున్న ధనరాజ్` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఇంతకు మించిన ‘సక్సెస్ స్టోరి’ ఇంకేముంటుంది?
ఈ చిత్రం త్వరలో విడుదల కానుండడాన్ని పురస్కరించుకొని` తన గతాన్ని నెమరువేసుకోవడంతోపాటు` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ విశేషాలను ఆత్మీయంగా పంచుకొన్నారు ధనరాజ్. ఈరోజు (మే 7) ఆయన జన్మదినం..!!
అమ్మానాన్నల పెళ్లి కథ
అచ్చమైన తెలుగు సినిమా కథ!!
మా అమ్మ (కమలమ్మ)` నాన్న (సత్యరాజ్)లది ప్రేమ వివాహం. అది కూడా కులాంతర వివాహం. మా నాన్న.. మా అమ్మావాళ్ల నాన్న దగ్గర లారీ క్లీనర్‌గా పని చేసేవారు. నాన్నది రాజుల కులం, అమ్మావాళ్లది రెడ్డి కులం. లారీ యజమాని అయిన మా తాత` తన లారీలో క్లీనర్‌గా పని చేసే మా నాన్నకు` తన కూతురునిచ్చి పెళ్లి చేసేందుకు సహజంగానే ఒప్పుకోలేదు. దాంతో ఇంట్లోంచి పారిపోయి (లేచిపోయి) నాన్నను పెళ్లి చేసుకొంది అమ్మ. అందుకే కొన్ని సంవత్సరాలు తాతయ్యవాళ్లతో మాకు సత్సంబంధాలు లేవు. ఆ తర్వాత మెల్లగా సర్దుకుపోయారనుకోండి!
నాకు పదేళ్ల వయసులో
నాన్నకు నూరేళ్లు నిండిపోయాయి!!
నాన్నది తాడేపల్లిగూడెం, అమ్మవాళ్లది హనుమాన్ జంక్షన్. నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్న లారీ యాక్సిడెంట్‌లో చనిపోయారు. అందుకే నా చదువు కొన్నాళ్లు గూడెంలో` కొన్నాళ్లు హనుమాన్ జంక్షన్‌లో వానాకాలం చదువులా సాగింది. తాడేపల్లిగూడెంలో మా ఇంటి గోడకు సినిమా వాల్‌పోస్టర్లు అతికిస్తుండేవారు. వారానికోసారి మారుతుండే ఆ వాల్‌పోస్టర్స్‌ను.. సినిమా చూసినంత శ్రద్ధగా చూస్తుండేవాడ్ని. ముఖ్యంగా చిరంజీవిగారి ‘యముడికి మొగుడు’ పోస్టర్ చూశాక` మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిపోయాను.. ‘మన జీవితం సినిమాల్లోనే’ అని. కానీ.. అందుకోసం ఏం చేయాలి? ఎవర్ని కలవాలి? వంటివేమీ తెలియవు!
ప్రపంచాన్ని గెలిచిన
పోటుగాడిలా ఫీలైపోయాను!!
అమ్మకి కూడా చెప్పకుండా ఓరోజు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి హైద్రాబాద్‌లో వాలిపోయాను. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఫిలింనగర్ వెళ్లాలంటే ‘47 ఎఫ్’ బస్ ఎక్కాలని తెలుసుకొని, ఆ బస్సెక్కి ఫిలింనగర్‌లో పడ్డాను. ఓ రెండు రోజులు ఫిలింనగర్‌లో మన హీరోలందరి ఇళ్లు, స్టూడియోలు చూస్తూ గడిపాను. రాత్రిళ్లు ఎక్కడో ఒక చోట పడుకొనేవాడ్ని. కానీ మూడో రోజుకి` వాస్తవం తెలిసొచ్చింది. నేనెప్పుడూ నిర్ణయాలు చాలా ఫాస్ట్‌గా తీసుకొంటాను. రోజుకో పూట చొప్పున రెండ్రోజులు భోజనం చేసిన హోటల్‌లోనే మూడోసారి భోజనం చేస్తూ` నా పరిస్థితి చెప్పి, ఏదైనా పనివ్వమని అడిగాను హోటల్ యజమానిని. నేను అడిగిన వేళా విశేషం ఏంటో కానీ.. వెంటనే ఓకె అనేసాడాయన. కాకపోతే, నాలాంటి పదో తరగతి ఫెయిల్డ్ పిల్లాడికి ‘సర్వర్’ పనిగాక మరింకేముంటుంది హోటల్‌లో? ఆరోజు ప్రపంచాన్ని జయించినంత పోటుగాడిలా ఫీలైపోయాను. ‘హమ్మయ్య రేపట్నుంచి ఫుడ్డుకి, బెడ్డుకి ప్రోబ్లెం లేదు’ అన్న భావన నాకు అంతులేనంత ఉత్సాహాన్నిచ్చింది!
నా ఆశయం కోసం
అపోలోలో ‘ఆయా’గా చేరింది!!
సర్వర్ డ్యూటి చేస్తూనే` ఏ ఆఫీస్ ఎక్కడుంది వంటి విషయాలపై ‘రెక్కీ’ చేసేవాడిని. ఓ పది రోజులు గడిచాక` మా నాన్న దగ్గర క్లీనర్‌గా పని చేసిన ఓ వ్యక్తి నేను పని చేసే ‘కాకతీయ మెస్’కు వచ్చి నన్ను చూసాడు. మరుసటిరోజు ఉదయానికి అమ్మ వచ్చి వాలిపోయింది. ‘నువ్వు కూడా లేకుండా ఒంటరిగా నేనెలా ఉండేది?’ అని మొండికేసింది. అంతేకాదు` తను నాకు భారం కాకుండా ఉండడం కోసం, నటుడు కావాలన్న నా కోరికను నెరవేర్చుకోనేందుకు నాకు చేదోడువాదోడుగా ఉండేందుకుగాను.. అపోలో హాస్పిటల్‌లో ఆయాగా చేరిపోయింది.
కన్నబిడ్డలా.. కంటికి రెప్పలా చూసుకొన్నాడాయన!!
సర్వర్‌గా పని చేస్తూ.. అవకాశాల కోసం అలుపు లేకుండా తిరిగే సమయంలో డ్యాన్స్ మాస్టర్ విజయ్ పరిచయమయ్యారు. ‘సూపర్‌స్టార్ ఫిలిం ఇనిస్టిట్యూట్’ పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ నడిపేవారాయన. ఆయన దగ్గర రెండేళ్లు పని చేస్తూనే` ఆయన ఆబ్సెన్స్‌లో ఇనిస్టిట్యూట్ చూసుకొనేవాడ్ని. నా అదృష్టం ఏంటంటే` నేను పని చేసిన హోటల్ యజమాని రెడ్డిగారు కూడా నన్ను ఎంతో ఆదరించేవారు. ఇక విజయ్ మాస్టరైతే` నన్ను సొంత బిడ్డలా చూసుకొనేవారు. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఉన్నప్పుడే చమ్మక్‌చంద్ర, కో`డైరెక్టర్ క్రాంతి వంటి వాళ్లతో నాకు పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయాల పుణ్యమా అని తేజగారి ‘జై’లో మొదటిసారి కెమెరా ముందుకొచ్చాను. కానీ అది ‘గుంపులో గోవింద’ లాంటి క్యారెక్టర్ . ఆ సినిమాలో నన్ను మా అమ్మ మాత్రమే గుర్తుపట్టింది. దురదృష్టవశాత్తూ నన్ను నటుడిగా మా అమ్మ చూసిన మొదటి సినిమా, చివరి సినిమా కూడా అదే!! (ఒకింత ఉద్వేగానికి లోనవుతూ) ‘జై’ టైమ్‌లోనే వేణు పరిచయమయ్యాడు!
'జగడం’ నుంచి నా కెరీర్
‘పరుగు’ తీసింది!!
‘జగడం’ సినిమాలో ‘నాంపల్లి సతి’్త క్యారెక్టర్ కోసం సుకుమార్‌గారు నన్ను ఎంపిక చేయడం నా జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమా.. నాకు తాగుబోతు రమేష్‌లాంటి మంచి ఫ్రెండ్‌ను కూడా ఇచ్చింది. ‘జగడం’లో నా క్యారెక్టర్ చూసి ఇంప్రెస్ అయిన సంతోష్ అనే ఫ్రెండ్ రిఫరెన్స్‌తో ‘పరుగు’లో అల్లు అర్జున్ ఫ్రెండ్స్‌లో ఒకడిగా ఛాన్స్ వచ్చింది. ‘పరుగు’ తర్వాత నుంచి నా కెరీర్ పరుగు తీసిందనే చెప్పాలి. ఆ తర్వాత చేసిన ‘యువత’ కూడా నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ‘గోపి గోపిక గోదావరి’ సినిమాలో ఒక్క సీన్ చేయడం కోసం నన్ను పిలిపించిన పెద్ద వంశీగారు.. నా పెర్‌ఫార్మెన్స్ చూసి` నాతో చేయించిన సీన్ పొట్టి రాంబాబుతో రీషూట్ చేసి` నాకు మెయిన్ కమెడియన్‌గా ప్రమోషన్ ఇచ్చారు. నేను ‘జగడం’ చేస్తున్న టైమ్‌లోనే మరణంతో అమ్మకు ‘జగడం’ మొదలైంది. అమ్మకు క్యాన్సర్ అని తెలిసేటప్పటికి మా ఆర్థిక పరిస్థితి.. ‘రెక్కాడితే కానీ డొక్కాడని’ పరిస్థితి. ‘జగడం’ విడుదలయ్యేంతవరకు కూడా దేవుడు అమ్మను నా దగ్గర ఉంచలేదు!
అమ్మకు పెద్ద కర్మ చేయకుండానే
ఆమెను పెళ్లి చేసుకొన్నాను!!
ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తూ, దాన్ని రన్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో` సొంతంగా ఓ ఇనిస్టిట్యూట్ పెట్టాలని ఫిక్సయి, ఫిలిం నగర్‌లో చిన్న పోర్షన్ రెంట్‌కు తీసుకొని ‘స్టార్ ఫిలిం ఇనిస్టిట్యూట్’ అనే పేరు పెట్టాను. ఇనిస్టిట్యూట్‌లో డ్యాన్స్ నేర్పడం కోసం కూచిపూడి డ్యానర్ అయిన ‘శిరీష’ అనే అమ్మాయి నెంబర్ సంపాదించి, ఆమెకు కాల్ చేసి ఆఫీసుకి రమ్మన్నాను. ఆమె ఆఫీసులోకి వచ్చిన మొదటిసారే` నా జీవితంలోకి వచ్చిన అనుభూతికి లోనయ్యాను. చెబితే.. ఆశ్చర్యంగానూ, హాస్యాస్పదంగానూ ఉంటుందేమో కానీ.. మొదటి మీటింగ్‌లోనే ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్పేసాను. ‘ఇడియట్’ అని మనసులో తిట్టుకుందో, లేదో ఇప్పటికీ తెలియదు కానీ.. నావైపు కొరకొరా చూసి బయటకు వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజే అమ్మ చనిపోయింది. ఉన్న కాసిని డబ్బులు పెట్టి ఇనిస్టిట్యూట్‌కి అడ్వాన్స్ ఇచ్చాను. అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేంత స్నేహితులు అప్పటికింకా లేరు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో` చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడం వలన.. బుర్ర కూడా పనిచేయడం మానేసిన స్థితిలో` ముందు రోజు పరిచయమైన శిరీషకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఏదో ఎమోషనల్‌గా, సింపతీ కోసం అన్నట్లుగా ఆమెకు ఫోన్ చేసానే గానీ, ఆమె ఆ కష్టకాలంలో నన్ను ఆదుకుంటుందని అస్సలు అనుకోలేదు. కానీ తను మాత్రం.. తన చెవి దుద్దులు అమ్మేసి, ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టింది. కార్యక్రమం పూర్తయ్యేంతవరకు నాతోనే ఉంది. ఇటువంటి సీన్ ఏదైనా సినిమాలో అంతకుముందు నేను చూసి ఉంటే` డైరెక్టర్‌కి కొంచెం కూడా బుర్ర లేదని కచ్చితంగా అనుకొనేవాడ్ని. కానీ, అమ్మ చనిపోయిన మరుసటి రోజే` శిరీషను ‘నన్ను పెళ్లి చేసుకొంటావా?’ అని అడిగాను. ఒక్కరోజు పరిచయంతోనే.. కష్టకాలంలో నన్ను ఆదుకొన్న అమ్మాయి.. జీవితాంతం నన్ను గుండెల్లో పెట్టి చూసుకొంటుందన్న నమ్మకం నాకు కలిగింది. నేనున్న పరిస్థితుల్లో నేనడిగిన తీరు, అందులో నా నిజాయితీ శిరీషకు నచ్చాయి. అమ్మ చనిపోయిన మూడోరోజు` పెద్దమ్మతల్లి గుళ్లో.. శిరీష మెళ్లో మూడు ముళ్లు వేశాను. అలా.. అమ్మ చనిపోవడానికి ఒక రోజు ముందు నా ఆఫీసులో పరిచయమైన శిరీష` అమ్మ నా జీవితంలోంచి వెళ్లిపోయిన మూడోరోజు నా జీవితంలోకి ప్రవేశించింది. మొదట్లో మా ఆవిడ తరపువాళ్లు కూడా మా వివాహాన్ని ఆమోదించలేదు. కానీ.. ఇప్పుడు నాకున్న బంధువులంతా వాళ్లే!!
‘జబర్‌దస్త్’ నా కెరీర్‌కి కిక్ ఇచ్చింది!!
శిరీషతో పరిచయానికి కారణమైన ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించేలోపే` ఆర్టిస్టుగా నేను చాలా బిజీ అయిపోతూ వచ్చాను. చూస్తుండగానే.. చకచకా 80 సినిమాలు పైగా చేసుకొంటూ వచ్చేసాను. ముఖ్యంగా ‘జబర్‌దస్త్’ ప్రోగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపు అంతా ఇంతాకాదు. సినిమాలు నన్ను ప్రతి ఊరికీ పరిచయం చేస్తే` ‘జబర్‌దస్త్’ ద్వారా ప్రతి ఇంటికీ ఫెమిలియరయ్యాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంత మందితోనో నాకు స్నేహం ఏర్పడిరది. ఇక ‘పిల్ల జమిందార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల’ వంటి చిత్రాలు నటుడిగా నాకెంతగానో గుర్తింపు తెచ్చిపెట్టాయి!
‘ఓ చచ్చినోడి ప్రేమకథ’
అలా చచ్చిపోయింది!!
అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ` నన్ను హీరోగా ఎలివేట్ చేస్తూ` ‘ఓ చచ్చినోడి ప్రేమకథ’ అనే సినిమా మొదలై ఆగిపోయింది. సినిమా మొదలుపెట్టాక ప్రొడ్యూసర్‌కి ఏవో ప్రోబ్లెమ్స్ వచ్చాయి. నాకు పరిచయమున్న చాలా మంది ప్రొడ్యూసర్స్‌తో అచ్యుత్‌ను కలిపించాను. విన్నవాళ్లంతా ‘కథ కత్తిలా ఉంది’ అనేవాళ్లు. కానీ, నామీద కోటిన్నర పెట్టాలంటే ధైర్యం చాలేది కాదు. అలా కొన్ని ప్రయత్నాలు చేసాక, ఆ సినిమాను పక్కన పెట్టేసాం. ఆర్టిస్టుగా నేను ఫుల్ బిజీగా ఉండడంతో నాకేం ఫర్వాలేదు. కానీ, తెలిసినవాళ్లందరితోనూ ‘ధనరాజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’ అంటూ చెప్పుకొన్న అచ్యుత్ పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తే బాధేసింది. అలా అని నన్ను నేను హీరోగా పెట్టుకొని సినిమా తీయడానికి మనస్కరించలేదు. కథ`కథనాలే హీరోహీరోయిన్లుగా` అచ్యుత్‌ను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేయాలన్న సంకల్పమే` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రానికి శ్రీకారం చుట్టేలా చేసింది.
రామసత్యనారాయణగారు
ప్రసాద్‌గారు - ప్రతాప్‌గారు!!
రామసత్యనారాయణగార్ని కలిసి కథను చెప్పించినప్పుడు ఆయనకు కూడా విపరీతంగా నచ్చేసింది. కానీ.. క్యాస్టింగ్, లేకుండా ఎలా? అని సంకోచిస్తున్న సమయంలో.. నేను సగం పెడతాననడంతో రామసత్యనారాయణగారికి కాన్ఫిడెన్స్ వచ్చి ఆయన ముందుకొచ్చారు. యు.ఎస్‌లో షోస్ చేయడానికి వెళ్లినప్పుడు పరిచయమైన ప్రతాప్‌గారు` ప్రసాద్‌గారు.. ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి రావాలనుకొంటున్నట్లు తెలిసింది. ఎక్స్‌పీరియన్స్ కోసం` నాతో కలవమని చెబితే, రెండో మాట లేకుండా వెంటనే వాళ్లిద్దరూ ఓకె అనేశారు. అలా నా బిడ్డ ‘సుక్కురామ్’ సమర్పణలో` భీమవరం టాకీస్ బ్యానర్‌పై` ప్రసాద్‌రెడ్డి`ప్రతాప్‌రెడ్డిగార్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ స్టార్టయ్యింది. డైరెక్టర్ అచ్యుత్` తనకిచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు. అతని ప్రతిభ, అతని కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. నేను కూడా డైరెక్టర్ అడిగినవన్నీ ఇచ్చాను!
నన్ను ప్రేమించేవాళ్లు
ఇంతమందున్నారా?’ అనిపించింది!!
ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకొని పని చేసినవాళ్లు చాలా తక్కువ. నా మీద ప్రేమతో, అభిమానంతోనే అందరూ ఈ సినిమా కోసం పని చేశారు. నాతో సహా, ఈ సినిమాలో నటించిన వాళ్లంతా ఇంతకుముందు హీరోలుగా నటించినవాళ్లే కావడం గమనార్హం. నేను ‘ఎ.కె.రావు, పి.కె.రావు’లో హీరోగా నటిస్తే` విజయ్‌సాయి కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే అనిల్‌కళ్యాణ్, రణధీర్ కూడా హీరోలుగా చేసినవాళ్లే. ఇక మనోజ్ నందం గురించి చెప్పాల్సిందేముంది?
నాగబాబు అన్నయ్య
నాకెంతగానో సహకరించారు!!
ఈ సినిమాకి పని చేసిన మా కెమెరామెన్ శివ, మ్యూజిక్ డైరెక్టర్ బోలేశావలి, ఎడిటర్ శివప్రసాద్, ఎఫెక్ట్స్ యతిరాజ్‌గారు, డిజైనర్ వివారెడ్డి... ఇలా ఒకరని కాదు, ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. ముఖ్యంగా నాగబాబన్నయ్య నాకెంతగానో సహకరించారు. అలాగే సింధుతులానిగారు ఎం.పి క్యారెక్టర్ చేయడంతో` సినిమా రేంజ్ మరింత పెరిగింది. అలాగే, నా మాట మన్నించి హీరో తనీష్ ఈ సినిమాలో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చాడు. నా ఫ్రెండ్ తాగుబోతు