Advertisementt

డీసీ వెంకట్రామిరెడ్డి మళ్లీ జైలుకు..!!

Mon 04th May 2015 02:53 PM
dc venkatramireddy,arrest,delhi police,cbi  డీసీ వెంకట్రామిరెడ్డి మళ్లీ జైలుకు..!!
డీసీ వెంకట్రామిరెడ్డి మళ్లీ జైలుకు..!!
Advertisement
Ads by CJ

తెలుగునాట విలాసపురుషుడిగా పేరొందిన డెక్కన్‌ క్రానికల్‌ యజమాని వెంకట్రామ్‌రెడ్డిని కష్టాలు వీడటం లేదు. సీబీఐ అరెస్టుతో జైలు పాలైన ఇతడు బెయిల్‌పై ఇటీవలే బయటకు వచ్చాడు. అంతలోనే మరో కేసులో ఇరుక్కుని వెంకట్రామిరెడ్డి కటకటాలపాలయ్యాడు. వెంకట్రామిరెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందినమునీష్‌ మక్కడ్‌ అనే వ్యక్తిపై వెంకట్రామిరెడ్డి దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తన అనుచరగణంతో మునీష్‌మక్కడ్‌ ఇంటిపై దాడి చేయడంతో అతణ్ని కొట్టారని, తుపాకీ మడమతో దారుణంగా హింసించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా మూడు రోజులు రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది. ఇప్పటికే సీబీఐ కేసుతో సతమతమవుతున్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కుని మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ