Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: మంచు లక్ష్మి

Mon 04th May 2015 11:44 AM
manchu lakshmi,dongata movie,ram gopal varma,may 8th release  సినీజోష్ ఇంటర్వ్యూ: మంచు లక్ష్మి
సినీజోష్ ఇంటర్వ్యూ: మంచు లక్ష్మి
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలీ నుండి వచ్చి నటిగా, నిర్మాతగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న డైనమిక్ లేడీ మంచు లక్ష్మి. ఇప్పుడు సింగర్ గా కూడా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సినిమాలకే అంకితం అవ్వకుండా సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో ఉండే మంచు లక్ష్మి ఇటీవల జరిగిన 'మా' ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. అయితే ప్రస్తుతం ఆమె నటించిన 'దొంగాట' చిత్రం మే8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తో సినీజోష్ ఇంటర్వ్యూ..

'దొంగాట' చిత్రం ఎలా ఉండబోతోంది..?

ఇంతకుముందు మా బేనర్‌లో గుండెల్లో గోదారి, ఊ కొడతారా ఉలిక్కిపడతారా వంటి సీరియస్‌ సినిమాలు చేశాం. ఫస్ట్‌ టైమ్‌ ఒక కామెడీ సినిమా చేస్తున్నాం. క్రైమ్, కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించాను. సినిమాలో ఓ హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తారు. అసలు ఆ కిడ్నాప్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాలు తెరపైనే చూడాలి. ఔట్ అండ్ ఔట్ కామెడీతో తెరకెక్కించిన ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుంది. అనుకున్న బడ్జెట్ లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసాం. మే 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్నిఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం.

సినిమాలో హైలైట్స్ ఏంటి..?

తొమ్మిది మంది హీరోలతో చేసిన పాట హైలైట్ అవుతుంది. అది ప్రమోషనల్ సాంగ్ కాదు. సినిమాలో సెకండ్ హాఫ్ లో నా పుట్టినరోజు సందర్భంగా వస్తుంది. నేను పాడిన 'ఏందిరో' సాంగ్ కి ఇంత రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. మొదట పాడాలి అనుకోలేదు కాని సాంగ్ లిరిక్స్ నచ్చి పాడాను. అదే పాటను విప్లవాత్మకంగా పాడి ఉంటె ఎవరు యాక్సెప్ట్ చేయరేమో.. ఫన్నీ గా ఎంజాయ్ చేసే విధంగా ఉంది కాబట్టే అందరికీ నచ్చింది.

ఆ తొమ్మిది మంది హీరోలను ఎలా ఒప్పించారు..?

నా మీద నమ్మకంతో అందరు సాంగ్ లో నటించడానికి అంగీకరించారు. నాగార్జునగారు, రవితేజగారు, మంచు మనోజ్‌, రానా, శింబు, నాని, నవదీప్‌, సుశాంత్‌, సుధీర్‌బాబు, తాప్సీ మేం అడగ్గానే స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వారికి ఈ సందర్భంగా థాంక్స్‌ చెప్తున్నాను. ముందు కొంచెం ఎక్కువ మందిని నటించమని అడిగాను కానీ కుదరక కొంతమందిని రిజక్ట్ చేయాల్సి వచ్చింది. అడిగిన వాళ్ళందరు వచ్చేసరికి సినిమాకి లైఫ్ వచ్చిందనిపించింది.

డైరెక్టర్ గురించి..?

ముందుగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయమని రామ్ గోపాల్ వర్మ గారిని అడిగాను. ఆయన కథ విని బావుంది కానీ నేను డైరెక్ట్ చేయలేను అని చెప్పారు. కన్విన్స్ చేయడానికి ట్రై చేసాను. ఇది నా జోనర్ కాదు నేను చేయను అని చెప్పేశారు. ఇంకా ఈ కథను వంశీ చేతిలో పెట్టాను. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సెట్ లో చాలా సీరియస్ గా ఉంటాడు. ఆయన డైరెక్ట్ చేయగలదు అని తెలుసు కానీ మరి ఇంత బాగా చేయగలదు అనుకోలేదు. తను నాకు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్. తన ఫస్ట్ సినిమా నాతోనే చేయాలనుకున్నాడు. అన్ని కుదిరి మొదటి సినిమా నాతోనే చేసాడు.

రామ్ గోపాల్ వర్మ గారు వద్దనడానికి కారణాలేంటి..?

ఆయనొక బ్రిలియంట్ టెక్నీషియన్. సౌండ్, లైటింగ్, ఎఫెక్ట్స్ ఇలా అన్ని విషయాలలో సినిమాను వరల్డ్ రేంజ్ లో తీసుకువెళ్ళారు. స్టొరీ బావుందన్నారు కాని ఆయన సీరియస్ గా ఉండే థ్రిల్లర్ మూవీస్ మాత్రమే డైరెక్ట్ చేయాలనుకుంటారు. 'దొంగాట' కామెడీ జోనర్ లోకి వస్తుంది. అందుకే ఒప్పుకోలేదు.

ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు..?

నైజాం లో 140 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన ఏరియాల్లో ఎన్ని థియేటర్లో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

డైరెక్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా..?

డైరెక్ట్ చేయాలనుంది. కానీ నా వల్ల కాదు. కథ విని బావుందా లేదా అని చెప్పగలను కానీ స్టోరీస్ రాయలేను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన 'సైన్మా' అనే షార్ట్ ఫిలిం చూసాను. నాకు చాలా నచ్చింది. ఆయనతో ఒక చిత్రాన్ని చేసే ప్లాన్ లో ఉన్నాను. జూన్ నెల నుండి ఆ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. అయితే ప్రొడ్యూసర్ గా మాత్రమే ఆ సినిమాకు వ్యవహరించనున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ