Advertisementt

అనంతపురంలో ఫ్యాక్షనిజం పడగవిప్పుతోందా..??

Thu 30th Apr 2015 03:50 AM
paritalaravi,sriram,murder,ananthapuram  అనంతపురంలో ఫ్యాక్షనిజం పడగవిప్పుతోందా..??
అనంతపురంలో ఫ్యాక్షనిజం పడగవిప్పుతోందా..??
Advertisement
Ads by CJ

అనంతపురంలో మళ్లీ పగలు రగులుకుంటున్నాయి. మద్దెలచెర్వు సూరి హత్యతో సమసిపోయాయనుకున్న ఫ్యాక్షనిజాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తున్నది ఎవరు..? వైసీపీ వరుసపెట్టి హత్యలకు గురికావడం వెనుక పరిటాల రవి అనుచరుల హస్తం ఉందా..? లేక వైసీపీ నాయకులు చెబుతున్నట్లు పరిటాల శ్రీరామే ఈ హత్యలు చేయిస్తున్నారా..? అనే విషయాలు ఇప్పుడు అనంతపురం జిల్లా వాసుల మదిని తొలుస్తున్నాయి.

అనంతపురంలో వైసీపీ నాయకుడు శివప్రసాద్‌రెడ్డి హత్యకు గురికావడం మళ్లీ ఆ జిల్లాలో కలకలం రేపింది. టీడీపీ ప్రభుత్వం ప్రోత్సాహంతో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామే ఈ హత్య చేసినట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో పోలీసులకు పట్టుబడ్డ ఓ కిరాయి ముఠా కూడా పరిటాల శ్రీరాం సుపారి మేరకే తాము అనంతపురంలో హత్య చేయడానికి బయలుదేరినట్లు చెప్పింది. దీంతో అప్పుడు శ్రీరాంకు చిక్కులు తప్పలేదు. ఇక కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంత కాలం గుట్టుగా ఉండిపోయిన శ్రీరాం.. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతీకార హత్యలు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు ఆ ఆరోపణలు ఖండిస్తున్నారు. ఇక శివప్రసాద్‌రెడ్డి హత్య వెనుక పరిటాల శ్రీరాం హస్తం ఉందన్న ఆరోపణల్లో వాస్తవమెంతనేది పోలీసులు దర్యాప్తులోనే తేలనుంది. అయితే జిల్లాలో మళ్లీ ఫ్యాక్షనిజం పడగవిప్పుతుండటంపై ఆ జిల్లావాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ