నాగచైతన్య హీరోగా శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై సుధీర్ వర్మ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందించిన ‘దోచేయ్’. ఈ చిత్రం శుక్రవారం విడుదలై నాగచైతన్య కెరీర్‌లో ఓ స్టైలిష్ మూవీ అనిపించుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి నాగచైతన్య విలేకర్లతో ముచ్చటించారు.
క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది..
'దోచేయ్' సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు అందరు సీరియస్ మూవీ అనుకున్నారు. కానీ ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ సినిమా. సినిమా కథ విన్నప్పుడు క్లాస్, మాస్ కథ అని చూడను. అందరికి కనెక్ట్ అయితే అది మాస్ మూవీ కొందరికే కనెక్ట్ అయితే అయితే క్లాస్ మూవీ. ఈ సినిమా మొదట్లో 'ఎ' సెంటర్స్ లో బాగా ఆడింది. చివరి రెండు రోజుల నుండి రెగ్యులర్ ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.
సబ్జెక్ట్ బావుందని..
ఇదొక క్రైమ్, కామెడీ చిత్రం. సినిమా కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ తరహా చిత్రంలో నటించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ కెరీర్ మొదట్లోనే ఇలాంటి ప్రయోగాలు చేయడానికి సాహసించలేకపోయాను. ఇప్పుడు సుధీర్ చెప్పిన సబ్జెక్టు బావుందని మొదటిసారిగా ఇలాంటి పాత్రలో నటించాను. కొంతకాలంగా నేను గమనించింది ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తున్నారని సో.. ఇలాంటి సబ్జెక్టు కూడా ఆదరిస్తారనిపించి సినిమా చేసాం.
బైక్ చేజ్ చాలా ఎంజాయ్ చేసాను..
సెకండ్ హాఫ్ లో వచ్చే బైక్ చేజ్ లో చాలా ఎంజాయ్ చేసాను. నాకు బైక్ రైడ్స్ అంటే ఇష్టం. సినిమా స్క్రీన్ ప్లే కు చేజ్ లెంగ్త్ ఎక్కువ ఉంటే బావుంటుందని యాప్ట్ అవుతుందని ఎక్కువ సమయం తెరపై చూపించారు. ఇందులో నా ప్రమేయం ఏమిలేదు. సినిమా కోసం స్పెషల్ హొమ్ వర్క్ చేయలేదు. సుదీర్ కొంచెం స్టైలిష్ గా కనిపించాలి అన్నాడు. సో హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ పై కొంచెం ఎక్కువ ఫోకస్ చేసాను. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఎక్కువగా డాన్సులు లేవు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ లలో నాకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది. కొంచెం కేర్ తీసుకొని చేసాను.
కథలో భాగంగా..
సినిమాలో హీరోయిన్స్ అంటే ఎక్కువ ఇంపార్టన్స్ ఉండదు. కానీ ఈ సినిమాలో కృతి కూడా కథలో భాగంగా అన్ని సన్నివేశాలలో ఉంటుంది. సినిమాకి ఎంటర్ టైన్మెంట్ ప్లస్ అయింది. పోసాని గారి పాత్ర, బ్రహ్మానందం గారి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
నేనేం ఎక్స్ పెక్ట్ చేయలేదు..
ఈ సినిమాకి ఏం రెస్పాన్స్ వస్తుందో మొదట్లో ఆలోచించలేదు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేవు. ఇది టిపికల్ తెలుగు సినిమాలా 6 పాటలు, ఎక్కువ ఫైట్స్ లా వెళ్ళలేదు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది. ఎంటర్ టైన్మెంట్ ఉంది. సో.. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనుకున్నాం.
ఫెయిల్యూర్ అనేది మంచిదే..
ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఫెయిల్యూర్ అనేది మంచిదే అది వచ్చినప్పుడు ఏం మిస్టేక్స్ చేసామో తెలుసుకొని తరువాత రిపీట్ చేయకుండా ఉంటాం. క్రిటిసిజంను పాజిటివ్ గా తీసుకుంటాను.
ఎక్స్ పెరిమెంటల్ సినిమాలు చేస్తా..
భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎక్స్ పెరిమెంటల్ సినిమాలు చేస్తాను. రిస్క్ ఉంటేనే గ్రోత్ ఉంటుంది. యూనిక్ స్టైల్ వస్తుంది. నాన్నగారు నటించిన 'గీతాంజలి' వంటి ఎక్స్ పెరిమెంటల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఏ టైంలో హిట్ వస్తుందో చెప్పలేము.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ప్రస్తుతానికి కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి తో ఓ స్క్రిప్ట్ వర్క్ లో ఉంది. గౌతంమీనన్ తో కూడా మాటలు జరుగుతున్నాయి.