Advertisementt

సభ టీఆర్‌ఎస్‌కు సంకటంగా మారింది..!!

Mon 27th Apr 2015 02:30 AM
trs,meeting,kcr,pared grounds,plenary  సభ టీఆర్‌ఎస్‌కు సంకటంగా మారింది..!!
సభ టీఆర్‌ఎస్‌కు సంకటంగా మారింది..!!
Advertisement
Ads by CJ

ీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభకు జనసమీకరణను ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడే 10 లక్షలకు మించి జన సమీకరణ జరగాలని, నియోజకవర్గానికి కనీసం పది వేలమందిని తరలించాలని పదేపదే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ జన సమీకరణే పార్టీకి ఇబ్బందిలా మారింది. పరేడ్‌ గ్రౌండ్‌ సామర్థ్యం కేవలం 4 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలో 10 లక్షల మంది వస్తే ఎక్కడ వారిని కూర్చబెట్టాలన్నది టీఆర్‌ఎస్‌ నాయకులకు అంతుచిక్కడం లేదు. 10 లక్షలు అనుకుంటే కనీసం 5 లక్షల మంది అయినా వస్తారని టీఆర్‌ఎస్‌ అధిష్టానం అంచనా వేసింది. కాని సీఎం విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పెద్ద ఎత్తున జనాలను సభకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రతి జిల్లా అధ్యక్షుడు తమ జిల్లానుంచి సభకు వస్తున్న కార్యర్తల గురించి కేసీఆర్‌కు ఓ అంచనా లెక్క చెప్పారు. ఇది పది లక్షలకు సమీపిస్తుండటంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో టీఆర్‌ఎస్‌ పడిపోయింది. ఇక పరేడ్‌ గ్రౌండ్‌లో పది లక్షల మంది పట్టరని, 5 లక్షల మందికే అది నిండుకుండలా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నగరాన్ని గులాభి వాహనాలు ముంచెత్తుతున్నాయి. మరి అనుకున్న మేర జనాభా వస్తే సికింద్రాబాద్‌ పరేడ్‌ వద్ద వాహనాలు కదిలే పరిస్థితి కూడా ఉండకపోవచు&.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ