మనదేశం పలు సంస్కృతులు, మతాల మేళవింపు. అలాగే మన దేశానికి కూడా పలు పేర్లు ఉన్నాయి. పాశ్చత్యా మీడియా మన దేశాన్ని ఇండియా అని సంబోదిస్తుండగా.. మనం భారత్ అని, చరిత్రకారులు హిందుస్తాన్ తదితర పేర్లతో ప్రస్తావిస్తుంటారు. ఇక మన రాజ్యంగంలో కూడా దేశాన్ని ఇండియా, భారత్ అని సంబోధించారు. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఓ సమస్య తెచ్చిపెట్టింది. మనదేశాన్ని ఇండియా కాకుండా భారత్ అనే పేరుతోనే సంభోదించేలా తీర్పునివ్వాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో రాజ్యాంగం ప్రకారం అసలు మన దేశం పేరేంటన్న సమస్య తలెత్తింది. దీనిపై క్లారిటీనిస్తూ కేంద్రం ఓ నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సమాధానంపైనే మన దేశం పేరు ఆధారపడి ఉంటుంది. మరి మోడీ సర్కారు ఇండియాకు ఓటేస్తుందా..? లేక భారత్‌కా అనేది తేలాల్సి ఉంది.