Advertisementt

చంద్రబాబుది అతివిశ్వాసమా..??

Sat 25th Apr 2015 12:12 AM
  చంద్రబాబుది అతివిశ్వాసమా..??
చంద్రబాబుది అతివిశ్వాసమా..??
Advertisement

చంద్రబాబునాయుడు పెద్ద ప్రణాళికలే వేస్తున్నారు. ఏపీ విభజనతో రెండు రాష్ట్రాలోనూ కొనసాగుతున్న పార్టీగా టీడీపీకి పేరుంది. దీనికితగినట్లు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకుంటారని మీడియా వర్గాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈఅయితే చంద్రబాబు రెండు రాష్ట్రాల్లో కాక నాలుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాలుగైదు రాష్ట్రాలనుంచి టీడీపీ రంగంలోకి దిగుతుందని చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 70కిపైగా స్థానాలనుంచి లోక్‌సభకు పోటీ చేస్తామని ఆయన చెప్పారు. 

 

మూడు దశాబ్దాలకుపైగా తెలంగాణలో టీడీపీ కొనసాగుతోంది. ఇక్కడ ఆ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీని పూర్తిగా ఖాళీ చేసే ఉద్దేశంతో కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ శాసనమండలి పక్షం పూర్తిగా టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. ఇక టీడీపీలోంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శుక్రవారం కారు ఎక్కారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ కావడానికి సిద్ధమవుతున్నారు. 30 ఏళ్లుగా బలమైన పునాదులున్న తెలంగాణలోనే పార్టీని కాపాడుకోలేకపోతున్న చంద్రబాబు ఇతర భాషల రాష్ట్రాలకు కూడా పార్టీని విస్తరిస్తాననడం అతివిశ్వాసమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement