ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు వేసిని పిటీషన్‌కు సంబంధించి సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. రాజధాని భూ సేకరణకు వ్యతిరేకంగా 600 మంది రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ రైతుల భూములను ప్రభుత్వం సేకరించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సర్కారు నడుచుకోవడం సమంజసం కాదని చెప్పింది. అంతేకాకుండా ఈ రైతులంతా తమ భూముల్లో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పింది. ఇది ఏపీ సర్కారుకు పెద్ద దెబ్బెనని చెప్పాలి.
హైకోర్టు తీర్పుతో మరికొందరు రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములివ్వడానికి అంగీకరించకపోవచ్చు. దీనికితోడు రాజధాని భూబాధితులకు మద్దతుగా ఉద్యమం చేస్తానని ఇప్పటికే అన్నాహజారే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అన్నాహజరే పిలుపుతో డైలమాలో ఉన్న రైతులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకునే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలన్ని సాఫీగా సాగుతున్న భూసేకరణ కార్యక్రమానికి తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశాలున్నాయి. మరి హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చనే వాదనలు వినబడుతున్నాయి. దీనికితోడు కేంద్రం భూసేకరణ చట్టాన్ని తెస్తే చంద్రబాబుకు పెద్ద ఊరట లభించనట్టే..!