తెెలంగాణలో టీడీపీ పార్టీని పూర్తిగా ఖాళీ చేసే వరకు టీఆర్‌ఎస్ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే టీడీపీకున్న ఎమ్మెల్సీలంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఏకంగా టీడీపీ శాసనమండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనంచేశారు. దీనిపై టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో మండల స్పీకర్ స్వామిగౌడ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే ఇప్పటికే టీడీపీ పక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలే కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌లోకి జంపయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
టీడీపీ తరఫున ఇబహ్రీంపట్నం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇప్పుడు 'కారు' ఎక్కే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తన అంతరింగికులు, అత్యంత సన్నిహితులతో సమావేశమైన ఆయన భవిష్యత్తు ప్రణాళికపై చర్చించినట్లు తెలుస్తోంది. మంచిరెడ్డి టీడీపీలో చేరడంపై వారంతా సానుకూలంగా స్పందించారని, అయితే ప్రస్తుతానికి ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ను మరింత బలపర్చాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఆ రెండు జిల్లాలనుంచి వలసలను భారీగా ప్రోత్సహించే ప్రణాళికలో ఉన్నారు. ఇక కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వస్తే ఆయనకు కూడా సముచిత స్థానం కల్పిస్తారని ఈ ఎమ్మెల్యేల సన్నిహితులు ఆశాభావంతో ఉన్నారు.