సత్యం రామలింగరాజు ప్రస్తుతం చర్లపల్లి కోర్టులో ఊసలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే. జైలులో తన అధిక సమయాన్ని పుస్తకాలు చదువుతూ రామలింగరాజు గడుపుతున్నారు. ఇక తనను చూడటానికి ఎవరైనా వచ్చినా కలవడానికి రామలింగరాజు ఆసక్తి చూపడం లేదని జైలువర్గాలు చెబుతున్నారు. ఇక తన శిక్షను తగ్గించాలంటూ రామలింగరాజు దాఖలు చేసిన పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తాము ఏమీ చేయలేమని, హైకోర్టుక వెళ్లాలని సూచించింది. ఆయనతోపాటు సత్యం కేసులో శిక్ష పొందుతున్న వారందరూ ఈ కేసునుంచి ఉపశమనం కలిగించాలని కోర్టుకు విన్నవించారు. ఇక నాంపల్లి కోర్టులో ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని 'సత్యం' నిందితులు యోచిస్తున్నట్లు సమాచారం. 'సత్యం' కుంభకోణానికి సంబంధించి రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామలింగరాజు మూడేళ్ల జైలు జీవితం గడిపారు. ఇక మిగిలిన నాలుగేళ్లలో కూడా సత్ప్రవర్తన కింద ఆయనకు జైలు శిక్షను తగ్గించే అవకాశాలున్నాయి. ఇక హైకోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఏడదో రెండేళ్లో తగ్గిస్తే రామలింగరాజుకు పెద్ద ఉపశమనం దొరికినట్లే..!