Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: శ్రీదివ్య

Mon 20th Apr 2015 02:02 PM
heroine sridivya,varadhi movie,satish kartikeya,varadhi stills,sridivya interview  సినీజోష్‌ ఇంటర్వ్యూ: శ్రీదివ్య
సినీజోష్‌ ఇంటర్వ్యూ: శ్రీదివ్య
Advertisement

బస్‌స్టాప్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అచ్చ తెలుగు హీరోయిన్‌గా అందరి ప్రశంసలు అందుకున్న శ్రీదివ్య లేటెస్ట్‌గా కాస్మిక్‌ ఇమాజినేషన్స్‌ పతాకంపై సతీష్‌ కార్తికేయ దర్శకత్వంలో వివేకానందవర్మ నిర్మించిన ‘వారధి’ చిత్రంలో అందర్నీ ఆకట్టుకునే ఒక అందమైన క్యారెక్టర్‌ చేశారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో హీరోయిన్‌ శ్రీదివ్యతో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ. 

‘వారధి’ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోంది?

ప్రేక్షకులు మా చిత్రాన్ని యాక్సెప్ట్‌ చేశారు. చాలా మంచి స్పందన వస్తోంది. థియేటర్‌లో ఆడియన్స్‌ స్పందన చాలా బాగుందని తెలిసింది. ఆడియన్స్‌ మధ్య సినిమా చూద్దామనుకున్నాను. కానీ, కుదరలేదు. ప్రీమియర్‌ మాత్రమే చూశాను. ఈ సినిమా రిలీజ్‌కి ముందు నాకు కొంత టెన్షన్‌ వుంది. ఈ సినిమా డైరెక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కొత్తవారు. కొంత గ్యాప్‌ తర్వాత తెలుగులో నా సినిమా రిలీజ్‌ అవుతోంది. ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని టెన్షన్‌ పడ్డాను. అయితే ఇప్పుడు ఆడియన్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. 

కొంత గ్యాప్‌ తీసుకున్న మీరు కొత్తవారితో ఎందుకు చెయ్యాలనుకున్నారు?

నాకు కథ బాగా నచ్చింది. అందులో నా క్యారెక్టరైజేషన్‌ బాగుంది. మిగతా క్యారెక్టర్లు కూడా చాలా కొత్తగా వున్నాయి. అందుకే కొత్త డైరెక్టర్‌, కొత్త బేనర్‌ అయినా ఈ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌లాగే రియల్‌ లైఫ్‌లో చాలా మంది వున్నారు. మానవ సంబంధాల గురించి డైరెక్టర్‌ చాలా అద్భుతంగా చూపించారు.

గ్లామర్‌ వున్న క్యారెక్టర్స్‌ చేస్తారా?

అందంగా కనిపించడం, మోడరన్‌గా కనిపించడం మధ్య చాలా తేడా వుంది. గ్లామర్‌గా కనిపించడం వరకు ఓకే. ఈ విషయంలో రేవతిగారు, జయసుధగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. వాళ్ళు చేసిన క్యారెక్టర్స్‌లాంటివి చేసి అందరికీ బాగా గుర్తుండిపోవాలని నా కోరిక. ఎక్స్‌పోజింగ్‌ కానీ, గ్లామరస్‌  పాత్రలుగానీ, లిప్‌ లాక్స్‌ ఇలాంటివి చెయ్యడానికి నేను ఇష్టపడను. 

తమిళ సినిమాలు ఎక్కువ చేయడానికి రీజన్‌?

సహజత్వానికి దగ్గరగా వుండే హీరోయిన్‌ పాత్రలకు అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తారు. అలాంటి క్యారెక్టర్స్‌ తెలుగులో కాస్త తక్కువనే చెప్పాలి. అయితే తెలుగులో అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీ వేరు. అక్కడ పేరు లేని నటీనటులు చేసినా సినిమా బాగుంటే ఆదరిస్తారు. నేను ఎలాంటి క్యారెక్టర్స్‌ చెయ్యడానికి ఇష్టపడతానో అలాంటి క్యారెక్టర్స్‌ నాకు తమిళ్‌లో దొరుకుతున్నాయి. అందుకే ఎక్కువగా తమిళ్‌ సినిమాలు చేస్తున్నాను. నేను నటించిన నాలుగు సినిమాలు వరసగా అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. 

‘బెంగుళూరు డేస్‌’ రీమేక్‌లో చేస్తున్నారు. దాని గురించి?

నేను రీమేక్‌ చెయ్యడానికి అంతగా ఆసక్తి చూపించను. బెంగుళూరు డేస్‌ సినిమా చూశాను. భాస్కర్‌గారు కథని మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశామన్నారు. ఛేంజ్‌ చేసిన తర్వాత కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా నా క్యారెక్టర్‌ని బాగా డిజైన్‌ చేశారు. 

‘కేరింత’లో ఎలాంటి క్యారెక్టర్‌?

చాలా బబ్లీగా వుండే క్యారెక్టర్‌. ఫస్ట్‌ నేను ఎలా చేస్తానో అని దిల్‌రాజుగారు టెన్షన్‌ పడ్డారు. నా పెర్‌ఫార్మెన్స్‌ చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. తమిళంలో బెంగుళూరు డేస్‌, కార్తీతో మరో చిత్రం చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్‌లో వున్నాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్‌ శ్రీదివ్య. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement