మోదీ ఓ వైపు, చంద్రబాబు మరోవైపు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు!
‘‘టేకిట్ గ్రాంటెడ్’’గా నిన్నటివరకు భారత దేశాన్ని తీసుకున్న ప్రపంచ దేశలు నేడు భారత్ పేరు చెబితేచాలు అప్రమత్తమవుతున్నాయి. ఆయా దేశాల సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ వారు గ్లోబల్‌గా ఎదుర్కొంటున్న సవాళ్ళని ఎత్తిచూపుతూ సమాజంలో అట్టడుగునున్న వారి అవసరాలని ప్రస్తావిస్తూ తమ ఇరుగింటివాడో, పొరుగింటివాడోలా వారి ఆదరాభిమానాన్ని సంపాదిస్తున్నారు మోదీ. ఇదే సమయంలో రాష్ట్ర విభజన నేపధ్యంగా రెక్కలు విరిగిన పక్షిలా కునారిల్లుతున్న ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టిపుజేస్తూ చైనా, జపాన్, సింగపూర్ ప్రభుత్వాలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు చంద్రబాబు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సింగపూర్, బీజింగ్‌లకు సమాంతరంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశలను చిగురింపజేసిన నవ్యాంధ్ర నిర్మాతకు అభినందనలు. ఇదే సమయంలో మోదీకి బాసటగా రతన్‌టాటా నిలవడం శుభపరిణామం. ప్రపంచపటంలో భారత్ అందునా ఆంధ్రప్రదేశ్ అజరామరంగా వెలగడం ఖాయం. కేంద్రంలో మోదీని ఎంచుకుని భారతీయులు, రాష్ట్రంలో చంద్రబాబుకి పగ్గాలు అప్పగించి ఆంధ్రులు తమ దూరదృష్టిని ప్రదర్శించారు.
- తోటకూర రఘు