సీీీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారామ్ ఏచూరి ఎన్నికయ్యాడు. ఎలాంటి పోటీ లేకుండానే ఏచూరి ఆపార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మొదట కేరళకు చెందిన రామచంద్ర పిళ్లై, సీతారామ్ ఏచూరిలు ఈ పదవి కోసం పోటీలో ఉన్నారు. ఇక చివరి క్షణాల్లో పిళ్లై పోటీనుంచి తప్పుకోవడంతో ఏచూరి ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి సీతారామ్ ఏచూరి కావడమే గమనార్హం. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా తెలుగునేత సురవరం సుధాకర్‌రెడ్డి ఉండగా.. ఇప్పుడు సీపీఎంకు కూడా తెలుగు వ్యక్తే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. ఇక దేశంలో కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ ఏకచట్రంలోకి రావాలనే యోచనలో ఉన్నాయి. అదే సమయంలో ఈ రెండు పార్టీలకు తెలుగు వ్యక్తులే ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికవడం పార్టీల విలీనాన్ని సులభతరం చేస్తుందని వామపక్షాల మద్దతుదారులు చెబుతున్నారు.