Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: అదాశర్మ

Sat 18th Apr 2015 10:50 AM
adhasharma,son of sathyamurthy,trivikram,alluarjun,samantha  సినీజోష్ ఇంటర్వ్యూ: అదాశర్మ
సినీజోష్ ఇంటర్వ్యూ: అదాశర్మ
Advertisement

అల్లు అర్జున్‌ హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘S/o సత్యమూర్తి’. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో అదాశర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అదా చేసిన పల్లవి పాత్రకి మంచి రెస్పాన్స్‌ వస్తోందని చెప్తోంది అదా. ఈ నేపథ్యంలో అదా శర్మతో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ..

ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

త్రివిక్రమ్ గారు సినిమాలు అధ్బుతంగా డైరెక్ట్ చేస్తారు. నేను నటించిన 'హార్ట్ ఎటాక్' సినిమా ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్, హరీష్ శంకర్, రాజమౌళి వంటి దర్శకులతో పని చేయాలనుందని చెప్పాను. నేను అనుకున్న మొదటి సంవత్సరంలో త్రివిక్రమ్ గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. వెంటనే ఓకే చేసేసాను. ‘S/o సత్యమూర్తి’ మంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. 

హీరోయిన్ గా చేసిన మీరు చిన్న పాత్రలో ఎందుకు నటించారు?

చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వలనేది నా కల. ఇంట్లో చెప్పినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు షాక్ అయినా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఎంతో ప్యాషన్ తో ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. నా దృష్టిలో చిన్న పాత్ర., పెద్ద పాత్ర అని ఉండదు. క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా ఏ పాత్రలో అయినా నటిస్తాను. ఈ సినిమాలో నేను నటించిన పల్లవి అనే పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. 

మీ తోటి నటీనటుల గురించి?

అల్లు అర్జున్ డాన్స్, ఎక్స్ ప్రెషన్స్ అధ్బుతం. చాలా బాగా నటిస్తాడు. చిన్న బీట్ కూడా మిస్ చేయకుండా చేస్తాడు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అల్లు అర్జున్ తో ఇంకెవరిని కంపేర్ చేయలేము. సమంత, నిత్యమీనన్ ల గురించి చెప్పాలంటే 'హార్ట్ ఎటాక్' టైం లో నీ ఫేవరేట్ హీరోయిన్స్ ఎవరు అంటే వారిద్దరి పేర్లే చెప్పాను. అలాంటిది ఈ సినిమాలో వారిద్దరితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. సమంత కమర్షియల్ హీరోయిన్ గా ఒక మార్క్ క్రియేట్ చేసింది. తన వస్త్రధారణ అంటే నాకు చాలా ఇష్టం. నిత్య టాలెంటెడ్ పర్సన్. అధ్బుతంగా నటిస్తుంది.

ఎలాంటి పాత్రల్లో నటించాలనుంది?

ప్రతి రోజు కొత్తగా ఉండాలనుకుంటాను. నేను ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించాను. ఒకటి హార్రర్ అయితే మరొకటి ఎమోషనల్ రోల్. ఇప్పుడు  ‘S/o సత్యమూర్తి’ లో ఒక ఫన్ రోల్ లో నటించాను. ఒకేలాంటి పాత్రల్లో నటించడం నాకు నచ్చదు. 

మీరు నటించిన రెండు సినిమాలు కన్నడలో ఒకేరోజు విడుదలవ్వడం ఎలా అనిపించింది?

'S/o సత్యమూర్తి’ , 'రానా విక్రమ' ఒకేరోజు కన్నడలో విడుదలయ్యాయి. రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. కన్నడలో నేను నటించిన మొదటి సినిమా 'రానా విక్రమ'.  అలానే నేను నటించిన 'హార్ట్ ఎటాక్' , 'హసీ తో ఫసీ' కూడా ఒకేరోజు విడుదలయ్యాయి. 

'సుబ్రహ్మణ్యం ఫర్ షేల్' లో ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు?

ఓ పల్లెటూరు అమ్మాయిగా ఆ సినిమా కనిపించబోతున్నాను. నేను ఇప్పటి వరకు నటించిన పాత్రలకు భిన్నంగా ఆ క్యారెక్టర్ ఉంటుంది. చాలా కూల్ క్యారెక్టర్.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?

హీరో ఆది తో 'గరం' సినిమాలో నటించనున్నాను. పి.వి.పి బ్యానర్ లో మరో సినిమా ఒప్పుకున్నాను. కన్నడలో డెబ్యు చేసాక అవకాశాలు వస్తున్నాయి కానీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. తెలుగులో అయితే ఖచ్చితంగా రెండు మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement