టెన్నిస్ క్రీడలో డబుల్స్ విభాగంలో నం. 1 ర్యాంకు దక్కించుకున్న సానియాను ఇప్పుడు యావత్తు దేశం పొగడ్తలతో ముంచుత్తుతోంది. అదేంటో ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినప్పటినుంచి తన ఆట తీరు మరింత మెరుగుపడి వరుసగా టోర్నీలు గెలుస్తూ వస్తోంది. అయితే సానియా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటు భారత్‌తోపాటు అటు పాకిస్తాన్‌లోనూ ఆమెకు అభిమానులున్నారు. అంతేకాకుండా ఇక ఆమె భారత్ తరఫున కాకుండా పాకిస్తాన్ తరఫున బరిలోకి దిగాలంటూ ఆ దేశపు అభిమానులు, నాయకులు కోరుకుంటున్నారు. దీన్ని సున్నింతంగా తిరస్కరిస్తూ వస్తున్న సానియా భారత్ తరఫునే బరిలోకి దిగుతున్నారు.
అయితే ఫెడ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆమె బరిలోకి దిగకపోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచుల్లోనూ అత్యంత సునాయసంగా భారత్ విజయాన్నిదక్కించుకున్నప్పటికీ సానియా ఎందుకు బరిలోకి దిగలేదో అర్థంకాక అభిమానులు నిరాశకు గురయ్యారు. హైదరాబాద్‌లో సానియా మీర్జా బరిలోకి దిగడం చాలా అరుదు. రాకరాక వచ్చిన ఈ మ్యాచ్‌లో సానియా తప్పకుండా ఆడుతుందని అభిమానులు భావించారు. అయితే నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా సూచలనకు మాత్రమే సానియా పరిమితమయ్యారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగి పాకిస్తాన్‌ను ఓడిస్తే అక్కడి అభిమానులను తాను దూరం చేసుకుంటానన్న ఆందోళనతోనే సానియా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఇన్నాళ్ల బిజీ షెడ్యూల్ కారణంగానే సానియా విశ్రాంతి కోరుకున్నారని, మలేషియాతో మ్యాచ్‌లో ఆమె బరిలోకి దిగుతారని సానియా మీర్జా సన్నిహితులు చెబుతున్నారు.