Advertisementt

ప్రత్యక్ష హెచ్చరికలకు దిగిన ప్రభుత్వం..!!

Thu 16th Apr 2015 08:53 AM
ap capital,land pooling,minister narayana,warning  ప్రత్యక్ష హెచ్చరికలకు దిగిన ప్రభుత్వం..!!
ప్రత్యక్ష హెచ్చరికలకు దిగిన ప్రభుత్వం..!!
Advertisement

       ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరు అమరావతి. బౌద్ధుల పుణ్యక్షేత్రమైన అమరావతి పేరే దీనికిపెట్టారు. అయితే మన అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దవద్దన్న బౌద్ధుల ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఇక్కడ భూసమీకరణాలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం ప్రస్తుతం రైతులనుంచి భూములు సమీకరిస్తున్నారు. కొందరు రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం భూములు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. వీరికి పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి. కాని జూన్‌లోగా కొత్త రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని కంకణం కట్టుకున్న ఏపీ ప్రభుత్వం నయానో భయానో రైతులను దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.

 

          ఏపీలో  రాజధానికి కావాల్సిన భూముల సమీకరణ కోసం చంద్రబాబునాయుడు ఓ కమిటీ వేశారు. దీంట్లో ఎంతో యాక్టీవ్‌గా పనిచేస్తున్న మంత్రి నారాయణ ఇప్పటికే పలుమార్లు రైతులను భూముల సమీకరణ కోసం హెచ్చరించారు. స్వచ్ఛందంగా భూమలు ఇస్తే మంచిదని, లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తాజాగా ఆయన స్వరంలో పదును మరింత పెరిగింది. రైతులు రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చేయాలని లేకపోతే భూసేకరణ చట్టం వినియోగించి భూములు తీసుకుంటామని చెప్పారు. భూసేకరణ చట్టం వినియోగిస్తే రైతులకే నష్టమని కూడా చెప్పాడు. కోర్టుకు వెళ్లే విషయమై రైతులు పునరాలోచించుకోవాలన్నాడు. భూముల సమీకరణకు పరోక్ష హెచ్చరికలు పనిచేయకపోవడంతో నారాయణ ప్రత్యక్ష హెచ్చరిల్లోకి దిగినట్లు కనిపిస్తోంది. మరి ఇంత బహిరంగంగా రైతులను హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని విపక్షాలు ఏమాత్రం నిలదీస్తాయో వేచిచూడాలి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement