దేశంలోనే అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా ఆమెకు పేరుంది. దానికి తగిన విధంగానే ఆమె ఎప్పుడు ఓ వివాదంలో కూరుకుపోతూ మీడియాకు కావాల్సినంత మసాలాను అందిస్తుంది. ఆమె మరెవరో కాదు అసోం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రుమినాథ్. కార్ల చోరీ రాకెట్‌తో సంబంధముందని రుమినాథ్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో మరోసారి దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగుతోంది. ఆమె రెండో భర్త కార్ల చోరీ కేసులో అరెస్టయ్యి ఈ దొంగతనాలతో రుమినాథ్‌కు కూడా సంబంధమున్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు కోర్టు అనుమతి తీసుకొని ఆమెను జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. బొర్ఖోలా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రుమినాథ్ గతంలో మొదటి భర్త బతికి ఉండగానే ముస్లిం మతంలోకి మారి రెండో వివాహం చేసుకుంది. ఆ రెండో భర్తతో ఓసారి హోటల్ గదిలో ఆమె ఉన్నప్పుడు స్థానికులు దాడి కూడా చేశారు. అంతేకాకుండా అర్ధనగ్నంగా ఆమె వెబ్‌కామ్‌లో జరిపిన చాటింగ్ వీడియో బయటకు వచ్చి హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆ రెండో భర్త కారణంగానే ఆమె జైలులో ఊచలు లెక్కబెడుతోంది. మరి ఈమె తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెబుతోంది. చూద్దాం.. మరి కోర్టులో ఏం తేలనుంది.