Advertisementt

జెరూసలెంకు జగన్‌..!!

Thu 16th Apr 2015 01:34 AM
jaganmohan reddy,jerusalem,cbi court  జెరూసలెంకు జగన్‌..!!
జెరూసలెంకు జగన్‌..!!
Advertisement
Ads by CJ

అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న జగన్‌ ప్రస్తుతం రాష్ట్రందాటి వెళ్లాలన్న కోర్టు అనుమతి తప్పనిసరి. ఇక ఆయన క్రైస్తవుల పవిత్ర స్థలమైన జెరూసలెంకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. రెండు నెలల క్రితమే తాను జెరూసలెంకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని జగన్‌ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి సీబీఐను కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక యథావిధిగా సీబీఐ జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించాలని కోర్టుకు విన్నవించింది. దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతినిచ్చింది. ఇక త్వరలోనే జగన్‌ జెరూసలెంకు కుటుంబ సమేతంగా వెళ్లివచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు బుధవారం నుంచి జగన్‌ ప్రాజెక్టుల టూర్‌ మొదలైంది. మొదటి రోజు ఆయన ఉభయ గోదావరి జిల్లాలోనూ పర్యటించనున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ