మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఆ ఐదుగురు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్న నటుడు క్రాంతి. తాజాగా కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానందశర్మ నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘వారధి’లో హీరోగా నటిస్తున్నాడు క్రాంతి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో క్రాంతితో ‘సినీజోష్’ ఇంటర్వ్యూ.
మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
మాది గుంటూరు. ఎం.బి.బి.ఎస్. కంప్లీట్ చేశాను. సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పినపుడు మా పెద్దవాళ్ళు ఒకటే చెప్పారు. ఏదైనా సపోర్ట్ పెట్టుకొని వెళ్ళమన్నారు. అందుకే ఎం.బి.బి.ఎస్. చేశాను. చిన్నప్పటి నుంచి హీరో అవుదామన్న ఆలోచనతో వున్న నేను నాకు వచ్చిన అవకాశాల్లో సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాను. మొదటి అవకాశం వైజాగ్‌లో సత్యానంద్‌గారి దగ్గర ట్రైన్ అవుతున్నప్పుడు వచ్చింది. సత్యానంద్‌గారి దగ్గరికి ఆడిషన్స్‌కి వచ్చిన రామరాజుగారు ‘మల్లెల తీరంలో..’ క్యారెక్టర్‌కి నేను సూట్ అవుతానని తీసుకున్నారు.
‘వారధి’లో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
ఈ సినిమాలోని మిగతా ఆర్టిస్టులతో పోల్చుకుంటే పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్ వున్న క్యారెక్టర్ నాది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, కమర్షియల్‌గా సినిమా హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ వుండడం వల్ల ఈ క్యారెక్టర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. నా క్యారెక్టర్‌కి నెగెటివ్ షేడ్ వుంటుంది. జనరల్‌గా వుండే రిచ్ గై, ఒక ప్లేబోయ్‌లాంటి క్యారెక్టర్ కాకుండా ఒక స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ బౌండరీస్ వుండే క్యారెక్టర్. ఎదుటివారిలోని బాధలో కూడా చిన్న ఫన్ తీసుకునే క్యారెక్టర్. ఎవరైనా కింద పడిపోతే మనకి నవ్వొస్తుంది. కానీ, వీడి క్యారెక్టర్ ఎలా వుంటుందంటే వాడిని కింద పడేసి నవ్వుతూ వుంటాడు. అలా నెగెటివ్‌గా వుండడానికి ఒక రీజన్ కూడా వుంటుంది. అతని జర్నీ ఎలా వుంది, ఎలా రియలైజ్ అయ్యాడు అనేది చూపించారు డైరెక్టర్‌గారు. హ్యూమన్ వాల్యూస్‌తో కూడిన ఎమోషన్స్‌తో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా చెప్పారు.
మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చెయ్యగలను అనుకుంటున్నారు?
పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్ వున్న ఏ క్యారెక్టర్ అయినా చెయ్యగలను అనుకుంటున్నాను. మన దగ్గర హీరోలు ఎక్కువగానే వున్నా, పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ వుండే లీడ్ రోల్స్ చేసేవాళ్ళు తక్కువ వున్నారనిపించింది. ఎక్కడైతే గ్యాప్ వుందో దాన్ని ఫిల్ చేస్తే మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వుంటాయనిపించింది. అందుకే పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. హీరో, హీరోయిజం అని కాకుండా లీడ్ క్యారెక్టర్స్ చెయ్యాలనుకుంటున్నాను.
సినిమాలో మీకు కనిపించే ఆత్మల గురించి?
అప్పటివరకు అందర్నీ టార్చర్ పెట్టిన వ్యక్తిని టార్చర్ పెట్టడానికి కొత్తవారు వచ్చారు. వాళ్ళని ఇతను ఏమీ చేయలేడు. కానీ, ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి అని వాళ్ళు అడుగుతూ వుంటారు. దాని చుట్టూ ఫన్నీగా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ వుంటాయి. అతను నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు వాళ్ళ కోరికలు విన్నప్పుడు ఇలాంటి కోరికల కోసం కూడా ఇంకా ఆత్మలు తిరుగుతుంటాయా అనిపిస్తుంది. సినిమాలో ఫన్ అనేది రావడం కోసం ఘోస్ట్ ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేశారు. ఇతనికి మాత్రమే ఆత్మలు కనిపిస్తూ వుంటాయి.
శ్రీదివ్య మీకు హీరోయిన్‌గా రిపీట్ అవ్వడానికి రీజన్?
అది పూర్తిగా డైరెక్టర్‌గారి ఛాయిస్. మొదట ఈ సినిమాకి ‘ఆరాధన’ అనే టైటిల్ పెట్టారు. ఎందుకంటే టోటల్‌గా ఆ అమ్మాయి చుట్టూనే కథ తిరుగుతూ వుంటుంది. శ్రీదివ్య హీరోయిన్‌లా కాకుండా గర్ల్ నెక్స్‌ట్ డోర్‌లా వుంటుంది. అందుకే ఆమెను తీసుకున్నారేమో.
ఇది ట్రయాంగిల్ లవ్‌సోరీనా?
ట్రయాంగిల్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది కానీ అలా వుండదు. రెగ్యులర్‌గా వుండే కథలో కొన్ని కొత్త యాంగిల్స్ వుంటాయి. నా క్యారెక్టరైజేషన్‌కి ఒక డెఫినిషన్ వుందో, ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్‌కి కూడా ఒక డెఫినిషన్ వుంటుంది. ఆ యాంగిల్ ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో రాలేదనుకుంటున్నాను. మనువుతో మరణం కూడా అయిపోయింది అనుకునే క్యారెక్టర్ ఆ అమ్మాయిది.
యం.బి.బి.ఎస్. చదివిన మీరు దాన్ని వదిలి సినిమాల్లోకి రావడం రిస్క్ అనిపించలేదా?
మన లైఫ్‌లో సర్‌వైవల్ ప్రాబ్లమ్ వుంటే మీరన్నట్టు ఇది రిస్కే. కానీ, నాకు అలాంటి ప్రాబ్లమ్ లేదు. చిన్నప్పటి నుంచి వున్న కోరిక యాక్టర్ కావాలని. దాన్ని ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. ఇక్కడ చాలా కష్టం అని అందరూ అంటుంటారు. కానీ, ప్రతి మనిషికి ఫిట్ అయ్యే జోన్ ఒకటి వుంటుంది. తను దేనికి క్యాపబుల్ అనేది తెలుసుకుంటే దానిలో ఫిట్ అవ్వొచ్చు. నాకు క్యాపబుల్ కానిది ట్రై చేస్తే నాకు ఎప్పటికీ కష్టంగానే వుంటుంది. ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి.
డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న సతీష్ కార్తికేయ వర్క్ ఎలా వుంది?
ఎక్స్‌లెంట్‌గా వుంది. చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. ఒక కొత్త కాన్సెప్ట్‌ని అంతే కొత్తగా తెరకెక్కించారు. ఆయన డైలాగ్స్ చాలా బాగుంటాయి, నేచురల్ లాంగ్వేజ్‌లోనే చాలా ఫన్నీగా వుంటాయి. కమర్షియల్ మూవీయే కానీ, ఈ జోనర్ మన తెలుగు సినిమాల్లో తక్కువనే చెప్పాలి. క్యారెక్టరైజేషన్స్‌ని అద్భుతంగా చేశారు. సినిమాలో చాలా ఫన్ వుంటుంది. ఈ సినిమా చూసి ఎవరూ డిజప్పాయింట్ అవరు. అంత బాగా తీశారు. సతీష్‌గారు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
‘చంద్రుడిలో వుండే కుందేలు’ చేస్తున్నాను. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయింది అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘వారధి’ హీరో క్రాంతి.