ప్రతి సంవత్సరం ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ అఫ్ ఇండియా, మోస్ట్ డిజైరబుల్ మాన్ ఎవరు..? అని మధ్య ఓటింగ్ నిర్వహిస్తుంది. పాఠకులు తమ అభిమాన హీరోకు ఓటు వేయడం ఆనవాయితి. గత రెండేళ్లుగా మహేష్ బాబు అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. 2013లో అయితే అతన్ని ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ మాన్ గా టైమ్స్ అఫ్ ఇండియా ప్రకటించింది. 7.34 లక్షల మంది పాఠకులు మహేష్ బాబుకు ఓటు వేసినట్టు తెలిపింది. ఆశ్చర్యకరంగా 2014 సంవత్సరంలో మహేష్ బాబు రెండవ స్థానానికి పడిపోయాడు. అది కూడా హైదరాబాద్ నగరానికి. చివరి రెండు సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడం కారణం అయ్యుంటుందేమో.
హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మాన్ గా రానాకు పాఠకులు పట్టం కట్టారు. రానా మొదటిస్థానంలో నిలవగా, మహేష్ బాబు రెండవ స్థానంలో నిలిచాడు.ఆరడుగుల ఎత్తు, హల్క్ లాంటి కిల్లర్ బాడీ, మాచో లుక్స్ రానాను మొదటిస్థానంలో నిలిపాయని పేర్కొంది. రానా నటిస్తున్న సినిమాలు కూడా అతను మొదటి స్థానంలో నిలవడానికి ఓ కారణం. హిందీలో బేబీ విజయం, తెలుగులో బాహుబలి సినిమాలు, హీరోయిన్లతో ఎఫైర్ అంటూ పుకార్లు అతన్ని ఎప్పుడు వార్తల్లో నిలిపాయి.