‘సిగరెట్, బీడీ’ - సినిమా కావచ్చు, బుల్లితెర కావచ్చు, పత్రికా ప్రకటన కావచ్చు, పోస్టర్ పబ్లిసిటీ కావచ్చు ‘ఆరోగ్యానికి హానికరం’ అన్న హెచ్చరిక, పుర్రెబొమ్మ కనిపిస్తాయి. ఎవరయినా సిగరెట్, బీడీ పొగతాగేది మహా అయితే పది నిమిషాలు. కానీ దేవాలయంలో ప్రత్యేకించి గర్భగుడిలో దీపారాధన, ధూపం, అగరొత్తులు, హారతి వెదజల్లే పొగ అదేనండీ కార్బన్ డయాక్సైడ్ మోతాదు ఎంతో ఒక్కసారి గమనించండి. వచ్చే ప్రతి భక్తుడూ తాను సమర్పించిన ధూప దీప నైవేద్యాలు భగవంతునికి అర్పించవలసిందేనని పట్టుబడతాడు. గర్భాలయానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, కిటికీలు వుండవు. అర్చక స్వాములు ఆ కార్బన్ డయాక్సైడ్ పీలుస్తూ ఉక్కలో మగ్గిపోవలసిందే. నలభై ఏళ్ళొచ్చేసరికి అర్చకస్వాములు లంగ్ సమస్యతో హాస్పిటల్ మెట్లెక్కవలసిందే. అలాగే పసిపిల్లలకి తలారా స్నానం చేయించి ధూపం వేస్తారు. ఆ పసిగుడ్డు ఆ పొగ భరించలేక తల్లడిల్లుతుంది. మన గర్భగుడుల నిర్మాణ శైలి ఎంతటి అనారోగ్యాన్ని కొనితెస్తుందో, అర్భక అర్చక స్వాములు అనారోగ్యాన్ని ఎలా కోరి తెచ్చుకుంటున్నారో చర్చ జరగాలి. అలాగే మస్కిటో కాయిల్స్ వాడకంపైనకూడా!
హిందూ దేవాలయాలలోని గర్భగుడులుకన్నా బాబా మందిరాలు, క్రైస్తవుల ముస్లింల ప్రార్ధనా మందిరాలు ఆరోగ్య రీత్యా బెటర్!
- తోటకూర రఘు