ఏ ముహూర్తాన టెన్నిస్ తార సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కెసిఆర్ గౌరవించారో గాని, ఆ రోజు నుంచి సానియా దశ తిరిగింది. డబుల్స్ ర్యాంకింగ్‌లో దూసుకుపోతోంది. మహిళల డబుల్స్‌లో వరల్డు నెం.1 ర్యాంకుతో వెలిగిపోతోంది. ఇంతకుమునుపు బాడ్మింటన్‌లో సైనా సెహ్వాల్ ప్రపంచ నెం.1 క్రీడాకారిణిగా నిలిచింది. వీరిద్దరితోపాటు సింధు, గుత్తాజ్వాల వంటి యువ క్రీడాకారిణులు ‘పద్మ’ అవార్డులు అందుకున్నారు - ప్రపంచ పోటీలలో అదరగొడుతున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో సైతం హైదరాబాద్ ఆరుగురితో అదరగొట్టింది. దేశంలో మిగులు బడ్జెట్ వున్న రాష్ట్రాలలో ప్రముఖ స్ధానం తెలంగాణదే.