Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: అడివి శేష్‌

Tue 14th Apr 2015 01:10 PM
actor adivi sesh,adivi sesh in dongata,laxmi mandhu,director vamsi krishna  సినీజోష్‌ ఇంటర్వ్యూ: అడివి శేష్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: అడివి శేష్‌
Advertisement
Ads by CJ

కర్మ, కిస్‌, లేడీస్‌ అండ్‌ జెంటిమెన్‌ వంటి చిత్రాల్లో హీరోగా నటించి పంజా, రన్‌ రాజా రన్‌, బలుపు వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన విలక్షణ నటుడు, దర్శకుడు అడివి శేష్‌. ప్రభాస్‌ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ చిత్రంలో కూడా ఒక ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటిస్తున్న అడివి శేష్‌ ప్రస్తుతం వంశీకృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ మంచు ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మిస్తున్న క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దొంగాట’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి పాటలు విడుదలయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అడివి శేష్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

‘దొంగాట’ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది?

మొదట ఈ సినిమాలో నాకు ఆఫర్‌ ఇచ్చింది డైరెక్టర్‌ వంశీ. ఈ కథను వంశీ నేరేట్‌ చేసినపుడు నేను చేసిన వెంకట్‌ క్యారెక్టర్‌కి ఇందులో వున్న చాలా ట్విస్ట్‌లు, టర్న్స్‌ నాకు నచ్చాయి. నేను చేస్తున్న సినిమాల్లో ఇవి ఒక పార్ట్‌ అయిపోయాయేమో నాకు తెలీదు. నేను చేసిన సినిమాల్లో ట్విస్ట్స్‌ అండ్‌ టర్న్స్‌ అనేవి ఒక యాక్టర్‌గా నాకు బాగా హెల్ప్‌ అయ్యాయి. నేనే ప్రెడిక్ట్‌ చెయ్యలేని ట్విస్ట్స్‌ అండ్‌ టర్న్స్‌ ఈ సినిమాలో పడ్డాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఇమ్మీడియట్‌గా చేస్తానని చెప్పాను. ఈ క్యారెక్టర్‌కి మొదట వేరే వారిని అనుకున్నారు. నేను మూడో ఛాయిస్‌ అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈ క్యారెక్టర్‌ నాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. నాకు ఈ ఆఫర్‌ వచ్చిన రెండు వారాల్లోనే షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. 

సినిమా చేసిన తర్వాత మీ క్యారెక్టర్‌గానీ, సినిమాగానీ ఎలా వచ్చిందనిపించింది?

థియేట్రికల్‌ ట్రైలర్‌ నిన్ననే మీడియాకి రిలీజ్‌ చేశారు. జెన్యూన్‌గా చెప్పాలంటే ఒక ఆడియన్‌గా థియేట్రికల్‌ ట్రైలర్‌ చూసి చాలా ఎక్సైట్‌ అయ్యాను. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నా కెరీర్‌లో ఇది ఒక ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుందని నా నమ్మకం. దీని తర్వాత ఇంకా పెద్ద సినిమాలు, పెద్ద క్యారెక్టర్స్‌ వస్తాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను.

ఇందులో మీ క్యారెక్టరైజేషన్‌ ఎలా వుంటుంది?

సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు వెంకట్‌. బేసిక్‌గా నేను ఒక ఐడియా మ్యాన్‌ని. డబ్బు కోసం ఎవరిరైనా కిడ్నాప్‌ చేద్దామా అనే థాట్‌లో నా క్యారెక్టర్‌ స్టార్ట్‌ అవుతుంది. మేం కిడ్నాప్‌ చెయ్యాలనుకున్నది శృతి అనే హీరోయిన్‌ని. స్మూత్‌గా కిడ్నాప్‌ చేస్తే అన్నీ వర్కవుట్‌ అవుతాయని మేం అనుకుంటే ఒక్కటి కూడా ప్లాన్‌ ప్రకారం జరగవు. ఆ గందరగోళంలో ఎలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్‌ జరుగుతాయి అనేది సినిమా. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే ప్రతి క్యారెక్టర్‌కి వాళ్ళ వాళ్ళ స్వార్థం వుంటుంది. 

వంశీకృష్ణకి ఇది ఫస్ట్‌ మూవీ కదా! ఎలా హ్యాండిల్‌ చేశారు?

అతనికి ఇది ఫస్ట్‌ మూవీ అయినా మా అందరి కంటే అతనికి సినిమా మీద ఎక్కువ అవగాహన వుందనేది నా ఫీలింగ్‌. ఆయన శ్రీకరప్రసాద్‌గారి దగ్గర ఎడిటింగ్‌ నేర్చుకున్నారు, గౌతమ్‌ మీనన్‌గారి దగ్గర ఎనిమిది సంవత్సరాలు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. మోహన్‌బాబుగారి కంపెనీలో ప్రొడక్షన్స్‌ చాలా హ్యాండిల్‌ చేశారు, ఎడిట్స్‌ చూశారు. అన్ని క్రాఫ్ట్స్‌ మీద మంచి ఎక్స్‌పీరియన్స్‌ వుంది. నేను చాలా సినిమాలు చేసినప్పటికీ అతని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. 

మంచు లక్ష్మీతో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?

లక్ష్మీ నాకు మంచి ఫ్రెండ్‌. మేమంతా ఫ్రెండ్స్‌గా వెళ్ళి వర్క్‌ చేస్తున్నామన్న ఫీలింగ్‌ కలిగింది. బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. సినిమా చాలా ఫాస్ట్‌ బేస్డ్‌గా వుంటుంది. అలాగే మా షూటింగ్‌ కూడా అంతే ఫాస్ట్‌ బేస్డ్‌గా జరిగింది. 

మీరు బాగా ఎక్సైట్‌ అయిన పాయింట్‌?

సినిమా చూస్తున్నప్పుడు నెక్స్‌ట్‌ ఇది జరగొచ్చు అనేది ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. కానీ, ఎగ్జాక్ట్‌గా దానికి ఆపోజిట్‌ జరుగుతుంది. ఆ పాయింట్‌ నాకు బాగా నచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్‌ చెయ్యగలిగిన సినిమా అయితే కాదు. నాకు పర్సనల్‌గా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ నచ్చింది. వంశీకి క్లైమాక్స్‌ బాగా నచ్చింది. సినిమాలో బిగ్గెస్ట్‌ ట్విస్ట్‌లు ఈ రెండు మూమెంట్స్‌లో వున్నాయి. డబ్బింగ్‌ చెప్తున్నప్పుడు చూశాను, నిజంగా లక్ష్మీ చాలా నేచురల్‌గా కామెడీ చేసింది. ఆవిడలో స్పాంటేనియస్‌ హ్యూమర్‌ వుంది. మంచి టైమింగ్‌తో ఆమె చేసిన కామెడీని చూసి ఒక ఆడియన్‌గా నేను చాలా ఎక్సైట్‌ అయ్యాను. 

ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్‌ కంటిన్యూ చేస్తారా?

నా మొదటి సినిమా ‘కర్మ’కి మంచి పేరు వచ్చింది కానీ, థియేటర్‌లో ఎవరూ చూడలేదు. ఆ సినిమా థియేటర్స్‌ నుంచి బయటికి వచ్చాక రీచ్‌ బాగా పెరిగింది. మా టివిలో స్క్రీనింగ్‌ వల్ల కావచ్చు. అలాగే వైజాగ్‌లోని ఒక కాలేజ్‌లో రెండు నెలలకి ఒకసారి ఈ సినిమాని స్క్రీన్‌ చేసి అందులోని ఫిలాసిఫికల్‌ పాయింట్స్‌ని డిస్కస్‌ చేస్తారట. ఇవన్నీ చూస్తుంటే మనం ఎక్కడా రాంగ్‌గా వెళ్ళలేదు అనిపిస్తుంది. అది చూసి పవన్‌కళ్యాణ్‌గారి ‘పంజా’ దొరికింది. అప్పటి నుంచి లీడ్‌ రోల్స్‌, సినిమాలో ఇంపార్టెన్స్‌ వున్న రోల్స్‌ చేస్తున్నాను. 

‘బాహుబలి’లో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

ఈ సినిమాలో నేను 20 నిముషాల క్యారెక్టర్‌ చేశాను. అది ఫస్ట్‌ పార్ట్‌లో వస్తుంది. నా జీవితంలో రివార్డింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ‘బాహుబలి’ చేయడం. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఎలా వుంటుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

అన్నయ్య సాయికిరణ్‌ చేస్తున్న ‘కేరింత’ మే లో రిలీజ్‌ అవుతుంది. జూలైలో మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అవుతుంది. అందులో నేను మెయిన్‌ లీడ్‌ చేస్తున్నాను. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ‘దొంగాట’, పివిపి వారి ‘క్షణం’ అనే సినిమాలో కూడా లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. అందులో అనసూయ, అదాశర్మ కూడా వున్నారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు అడివి శేష్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ