సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి మళ్లీ భారత్‌లో చర్చ మొదలైంది. ఆయనకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న రహస్య పత్రాలను విడుదల చేయాలనే డిమాండ్ ఈసారి గట్టిగా వినబడుతోంది. నెహ్రూ జమాన నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం బోస్ విషయంలో భయంతోనే వ్యవహరిస్తోంది. ఆ నేపథ్యంలోనే బోస్ కుటుంబ సభ్యులపై నెహ్రూ నిఘా ఉంచారని, ఆయన తిరిగి ప్రజల్లోకి వస్తే ప్రధాని పదవికి తనతో పోటీపడతాడని నెహ్రూ భావించినట్లు పలువురు చెబుతున్నారు. ఇక నెహ్రూ తర్వాత ప్రధానులైన కాంగ్రెస్ వారుసులు కూడా బోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను తొక్కిపెట్టారే తప్పా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో మోడీ ప్రధాని కావడంతో మళ్లీ ఈ వాదన మొదలైంది. స్వయంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే అప్పట్లో బోస్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వం ఎందుకు నిఘా పెట్టిందన్న విషయమై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌కు పక్కా వ్యతిరేకి అయిన సుభాష్ చంద్రబోస్ గురించి మోడీ సర్కారు మాత్రమే వాస్తవాలు వెల్లడిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అయితే ఆయనకు సంబంధించి వాస్తవాలు వెల్లడిస్తే కొన్ని విదేశాలతో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పుకొస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల క్రితం నాటి సంఘటనలను ప్రస్తుతం దేశ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీస్తాయనడం సత్యదూరం అన్నది వాస్తవం. కనీసం మోడీ సర్కారైనా బోస్‌కు సంబంధించిన వాస్తవాలు వెల్లడించి 7 దశాబ్దాలుగా ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తుందని ఆశిద్దాం.