నాగం జనార్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. తెలంగాణ అంశం గురించి బాబుతో విబేధించి నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆయన మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా బీజేపీలో క్రీయాశీలకంగా ఉండాలని ప్రయత్నించిన నాగంకు పార్టీ అధిష్టానం నుంచి మద్దతు కరువైందని ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు తన ముఖ్య అనుచరులతో ఓ సమావేశం కూడా నిర్వహించి భవిష్యత్తు ప్రణాళిక గురించి కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ముఖ్య అనుచరులంతా మళ్లీ ఆయన్ను టీడీపీలోకి వెళ్లమని సూచించినట్లు తెలిసింది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుననా చంద్రబాబుతో ఎలాంటి సమస్య లేనందునా నాగం ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడమే ఉత్తమమని వారు సూచించారు. ఈ మేరకు త్వరలోనే నాగం పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే టీడీపీ పార్టీ పూర్తిగా బలహీనపడుతోంది. అలాంటి సమయంలో నాగం తెలుగు దేశంలోకి వెళ్లి ఏంసాధిస్తారన్నది ఎవరికీ అర్థంకాకుండా ఉంది.