ఏపీ మంత్రి కామినేని సంచలన ప్రకటన చేశారు. తాను ఏ హీరోయిన్‌ను ఏడిపించలేదంటూ ఆయన ప్రకటించారు. అయితే ఆయన ఎందుకు ఈ ప్రకటన చేశారో అర్థంకాక మీడియావర్గాలు తలలు పట్టుకున్నాయి. అసలు జరిగిన విషయం ఏంటంటే ఓ వెబ్‌సైట్‌లో ఆయన హీరోయిన్ శృతిహాసన్‌ను ఏడిపించినట్లు వార్తలు వచ్చాయి. కామినేని చెన్నై వెళ్తుండగా అదే విమానంలో శృతిహాసన్ కూడా పయనించారని, ఈ సందర్భంగా తిహాసన్ మంత్రి కామినేని ఏడిపించినట్లు ఆ వెబ్‌సైట్‌లో వార్త వెలువడింది. అయితే ఈ విషయం అటు ఇండస్ట్రీ వర్గాలకుగాని ఇటు రాజకీయవర్గాలకుగాని తెలియదు. కాని మంత్రి స్వయంగా ఈ విషయంపై స్పందిస్తూ.. తన జీవితంలో ఏ అమ్మాయినీ తాను ఏడిపించలేదని, శృతిహాసన్‌ను ఏడిపించానన్న వార్తల్లో కూడా నిజం లేదని చెప్పారు. మరి ఎవరికీ తెలియని విషయాన్ని స్వయంగా మంత్రి తెలియజేసి ఏం సాధించాలనుకుంటున్నారో మీడియావర్గాలకు అంతుచిక్కలేదు. ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా..?