3 ఏప్రియల్ శిలువపై క్రీస్తు : 4 ఏప్రియల్, చంద్రుడ్ని కమ్మేసిన చీకట్లు, వర్షం!
క్రిస్టియన్లు - హిందువుల నమ్మకం నిజమైన వేళ!
3 ఏప్రియల్ మార్చి, గుడ్ ఫ్రైడే.
క్రీస్తుని శిలువ వేసిన రోజు.
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందర్నీ దుఖంలో ముంచిన రోజు.
క్రీస్తుని శిలువ వేసిన తర్వాత ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడుతుంది. అంతటా చీకటి అలముకుంటుంది. జోరున వర్షం ఆరంభమవుతుంది. వింతలు చోటుచేసుకుంటాయి.
- ఇదీ క్రిస్టియన్ల నమ్మకం. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ 4 ఏప్రియల్- ఆకాశాన చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్క శ్రీకాళహస్తిలో మినహా అన్ని హిందూ దేవాలయాలను మూసివేయడానికి కారణం వుంది. 4 ఏప్రియల్, చంద్ర గ్రహణం.
మార్చి 28 నుంచి 6 ఏప్రిల్ వరకు శ్రీరామ నవమి. నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మార్చి 28 తర్వాత ఈ నవరాత్రులలో ఆకాశాన్నుంచి దేవతలు చల్లే అక్షింతలు నీటి బిందువులై పుడమిపై పరుచుకుంటాయని హిందువుల నమ్మకం. ఈ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆకాశాన మేఘాలు, అక్కడక్కడ వానజల్లులు తలంబ్రాలవలె.
అటు క్రిస్టియన్ల ఇటు హిందువుల నమ్మకం నిజమయిన అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయింది.