ఎండలు మండుతుంటే సాయంత్రం వేళ మందుబాబులు ఓ చల్లని బీరు తాగకుండా ఉండలేని పరిస్థితి. అయితే ఇదే సమయాన్ని క్యాష్ చేసుకోవాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా బీర్ల ధరను 10శాతం పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీర్ల ధరను పెంచాలని ఎన్నో రోజులుగా మద్యం ఉత్పత్తిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం ధరలను దాదాపు 35 శాతం వరకు పెంచాలని టెండర్ల కమిటీ సూచించింది. అటు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ డిమాండ్‌ను కేసీఆర్ సర్కారు పక్కనపెట్టింది. ఎట్టకేలకు మంచి సీజన్ చూసి మందుబాబులకు షాకినివ్వడానికి టీ-సర్కారు సిద్ధమవుతోంది. లైట్ బీర్‌పై కనీసం రూ.5, స్ట్రాంగ్ బీరు ధరను రూ. 10 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వేసవిలో మండిపోతున్న ఎండలకుతోడు బీర్ల ధరలు కూడా పెరగడం మందుబాబులకు ఏమాత్రం రుచించని విషయం.