49 రోజుల సీఎంగా కేజ్రీవాల్‌కు గతంలో పేరుండేది. దేశంలో కుళ్లిపోయిన అవినీతి వ్యవస్థను మారుస్తాడని ఢిల్లీ ఓటర్లు మొదటిసారి ఆయనకు పట్టం కట్టినప్పుడు 49 రోజులకే కేజ్రీవాల్ రాజీనామా చేసి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక రెండో పర్యాయం కూడా ప్రజలు ఆయనపై నమ్మకంతో ఓటేసి ఆప్ పార్టీని ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టారు. ఇక సోమవారంతో కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసి 50 రోజులవుతుండటం ఓ ప్రత్యేకత. గత రికార్డును చేరిపివేస్తూ కేజ్రీవాల్ ఈసారి 50 రోజుల పాలనా కాలన్ని పూర్తిచేసుకోవడంపై ఆప్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మెజార్టీ లేకనే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనమా చేశారని, ఈసారి మాత్రం ఐదేళ్లపాటు పాలన కొనసాగించి ఢిల్లీ ప్రగతిని మారుస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రముఖులుగా ఉన్న యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్ వంటి నాయకులనే పార్టీ నుంచి బహిష్కరించి కేజ్రీవాల్ సంచలనం సృష్టించాడు. ఇక ఐదేళ్లపాలనా కాలంలో కేజ్రీవాల్ మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచిచూడాలి.