Advertisementt

గవర్నర్‌కు కేసీఆర్‌ ఓదార్పు..??

Mon 06th Apr 2015 12:46 AM
governer narasimhan,kcr,andhra jyothhi  గవర్నర్‌కు కేసీఆర్‌ ఓదార్పు..??
గవర్నర్‌కు కేసీఆర్‌ ఓదార్పు..??
Advertisement
Ads by CJ

ప్రస్తుతం గవర్నర్‌ నరసింహన్‌కు వ్యతిరేకంగా ఓ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ పత్రిక వరుస కథనాలు ప్రచురిస్తుండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏకంగా రెండు రాష్ట్రాల ప్రథమ పౌరుడిపైనే ఓ పత్రిక గురిపెట్టడం ఎంతైనా వింత గొలిపే విషయమే. అయితే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ఈ పత్రిక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు కూడా వ్యతిరేకంగా రోజూ కథనాలు ప్రచురిస్తోంది. ఈ తరుణంలో కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలుసుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. గవర్నర్‌పై జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి సంబంధించే కేసీఆర్‌ ఆయన్ను కలిసి ఉండవచ్చనే భావన నెలకొంది. గవర్నర్‌ను కలిసిన కేసీఆర్‌ ఆ పత్రిక కథనాలు గురించి ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఇక రాష్ట్ర ప్రథమ పౌరుడు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆ పత్రికకు సంబంధించిన చానల్‌ ప్రసారాలు ఇప్పటికే నిలిచిపోయాయి. ఇక కేసీఆర్‌ తలుచుకుంటే ఆ పత్రిక ప్రచురణ కూడా ఆగిపోతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్‌ ఎలాంటి చర్య తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ