Advertisementt

అన్న క్యాంటీన్లు ఎటుపోయాయి బాబు..??

Sun 05th Apr 2015 08:52 AM
anna canteens,amma canteens,chandrababu naidu,andhra pradesh  అన్న క్యాంటీన్లు ఎటుపోయాయి బాబు..??
అన్న క్యాంటీన్లు ఎటుపోయాయి బాబు..??
Advertisement
Ads by CJ

తమిళనాడు మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పేదలకు తక్కువ ధరకు భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా చెన్నై వెళ్లి పరిశీలన చేసి వచ్చింది. త్వరలోనే అనంతపురం, గుంటూరు, విశాఖ, తిరుపతుల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు సందడి చేశారు. మూడు నెలల క్రితం దీనికి సంబంధించి రోజూ ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మిన్నకుండా ఉండిపోయింది. ఈ పథకాన్ని ప్రారంభిస్తారా..? లేక వాయిదా వేస్తారా..? అన్న సమాచారం కూడా లేకుండాపోయింది. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందునా.. ఈ పథకం ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా ఎన్నికల సమయంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తే ఓటర్లను కూడా ఆకట్టుకోవచ్చని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ