Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌

Sat 04th Apr 2015 05:54 AM
art director s.ravinder,ravinder,son of satyamurthy,son of satyamurthy on april 9th  సినీజోష్‌ ఇంటర్వ్యూ: ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌
Advertisement
Ads by CJ

‘ఐతే’ చిత్రంతో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పరిచయమై ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసి ‘మగధీర’, ‘రాజన్న’ చిత్రాలకు బెస్ట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా నంది అవార్డులు అందుకున్నారు ఎస్‌.రవీందర్‌. ఆర్ట్‌ డైరెక్టర్‌గా బిజీ అయిన రవీందర్‌ లేటెస్ట్‌గా అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఎస్‌.రవీందర్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

మీ కెరీర్‌లో మీకు బాగా పేరు తెచ్చిన సినిమా ఏది?

అలా అని చెప్పలేను కానీ, నా కెరీర్‌లో మగధీర బిగ్గెస్ట్‌ హిట్‌. దాని తర్వాత అత్తారింటికి దారేది. త్రివిక్రమ్‌గారితో వర్క్‌ చేయడం వెరీ కూల్‌గా వుంటుంది. ఇండస్ట్రీలో మా దగ్గర నుంచి పని తీసుకునేవాళ్ళే వుంటారు. వాళ్ళకి ఏం కావాలో అదే ఇస్తాం. త్రివిక్రమ్‌గారి దగ్గర ఎలా వుంటుందంటే మేం లైఫ్‌లో ఎలా వుండాలి, ఎలా వుంటే బాగుంటుంది అనే విషయాల్లో మమ్మల్ని అప్‌డేట్‌ చేస్తూ వుంటారు. అది నాకు బాగా ఇష్టం. అంతకుముందు నా లైఫ్‌లో అలా జరగలేదు. ఒక విధంగా త్రివిక్రమ్‌గారి గైడెన్స్‌ నాకు ఎంతో ఉపయోగపడుతోంది. 

ఆర్ట్‌ డైరెక్టర్‌కి వుండాల్సిన ముఖ్యమైన లక్షణం?

అబ్జర్వేషన్‌ వుండాలి, సేమ్‌ టైమ్‌ పేషన్స్‌ కూడా వుండాలి. అన్నింటినీ మించి టేస్ట్‌ వుండాలి. ఈ మూడు అవసరం. అబ్జర్వేషన్‌ అంటే ఇప్పుడు మనం ఒక మీడియా ఆఫీస్‌లో వున్నాం. ఇక్కడ టేబుల్‌ మీద ఏమేం వున్నాయి, బ్యాక్‌డ్రాప్‌ ఏం వున్నాయి అనేది అబ్జర్వ్‌ చెయ్యాలి. అలాగే ఒక పోలీస్‌ ఆఫీసర్‌ ఇంటికి వెళ్ళామనుకోండి అది పోలీస్‌ ఆఫీసర్‌ ఇల్లు అని చెప్పక్కర్లేదు. అక్కడ కనిపించే క్యారెక్టర్స్‌తో అది పోలీస్‌ ఆఫీసర్‌ ఇల్లు అని తెలిసిపోవాలి. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏమిటనేది మన ఇల్లు చెప్పెయ్యాలి. అదే అబ్జర్వేషన్‌. 

డైరెక్టర్‌కి మీరు సజెషన్స్‌ ఇస్తారా? లేక మీకు డైరెక్టర్‌ సజెషన్స్‌ ఇస్తారా?

బేసిక్‌గా స్టోరీ నేరేట్‌ చేస్తారు. ఆ తర్వాత మా పని మేం చేసుకుంటూ వెళ్తాం. అవసరమైతే వాళ్ళు ఇన్‌వాల్వ్‌ అవుతారు. ఆ అవసరం ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్స్‌తో పనిచేశాను. 

ఇప్పటివరకు మీరు వేసిన సెట్స్‌ కష్టం అనిపించిన సెట్‌?

బాగా కష్టపడి వేసిన సెట్‌ అంటూ ఇప్పటివరకు ఏమీ లేదు. ఏది చేసినా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాను. జెన్యూన్‌గా చెప్తున్నాను ఫలానా సెట్‌ వేయడానికి కష్టపడాల్సి వచ్చిందని చెప్పడానికి ఏమీ లేదు. 

రాజమౌళిలాంటి డైరెక్టర్‌ దేనికీ త్వరగా కన్విన్స్‌ అవరు. మగధీరలాంటి భారీ సినిమాకి ఆయన్ని ఎలా కన్విన్స్‌ చేయగలిగారు?

బేసిక్‌గా ఆర్ట్‌లో మూడు అంశాలు వుంటాయి. కన్విన్స్‌, కన్‌ఫ్యూజ్‌, కరెక్ట్‌. మగధీర విషయానికి వస్తే కన్విన్స్‌ చెయ్యడానికి ట్రై చేశాం. రాజస్థాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సినిమా అది. రాజులు గుర్రాల మీద వెళ్ళి యుద్ధాలు చేసేవాళ్ళు, వారికి ఆర్మర్స్‌ వున్నాయి, వాళ్ళకి క్రౌన్స్‌ వున్నాయి. మీరు సినిమాలో చూసినవి రియల్‌గా అయితే అక్కడ లేవు. మేం ఏదైతే చేశామో అది అక్కడ లేదు. మేమిచ్చిన హెల్మెట్‌ కానివ్వండి, ఆర్మర్‌ కానివ్వండి, కాస్ట్యూమ్స్‌ కానివ్వండి అక్కడ అలా లేదు. ఎందుకంటే మేం కన్విన్స్‌ చేశాం. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం చేసేది ఒక బిజినెస్‌. కాబట్టి మనం జనాన్ని కన్విన్స్‌ చెయ్యాలి.  రాజస్థాన్‌లో డిజైన్స్‌ ఎక్కువ, కలర్స్‌ ఎక్కువ. మన సినిమాకి ఏం కావాలి అనేది కన్విన్స్‌ చేశాం. 

సన్నాఫ్‌ సత్యమూర్తి ఎలా వుంటుంది?

చాలా ఎమోషనల్‌ సబ్జెక్ట్‌ ఇది. ఈ మూవీలో రకరకాల వేరియేషన్స్‌ వుంటాయి. చాలా క్లాస్‌ లుక్‌ వుంటుంది. సేమ్‌ టైమ్‌ చాలా రా లుక్‌ వుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌ మోర్‌ వైబ్రెంట్‌ కలర్స్‌తో ప్యాషనేటెడ్‌గా వుంటుంది, సెకండాఫ్‌ వచ్చేసి రా లుక్‌ వుంటుంది. తమిళనాడులో రిచ్‌ అయిన విలన్‌ ఒకడు. అబ్రాడ్‌లో వుండే ఫాదర్‌కి కొడుకైన హీరో హైదరాబాద్‌లో వుంటాడు. వీళ్ళిద్దరికీ మధ్య వుండే కాంట్రాస్ట్‌లో వేరియేషన్స్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సైడ్‌ చూస్తే బాగా కనిపిస్తాయి. 

మీ 13 ఏళ్ళ కెరీర్‌లో ఒక ఆర్ట్‌ డైరెక్టర్‌గా మీరు శాటిస్‌ఫై అయిన సినిమా ఏది?

నేను హండ్రెడ్‌ పర్సెంట్‌ శాటిస్‌ఫై అయిన సినిమా అయితే నాకు రాలేదు. కానీ, మగధీరలో నేను చేసిన చాపర్‌ నా బెస్ట్‌ వర్క్‌గా ఫీల్‌ అవుతాను. 

సన్నాఫ్‌ సత్యమూర్తిలో హీరో వెడ్డింగ్‌ ప్లానర్‌ కదా? మీరు ఎన్ని సెట్స్‌ వేసి వుంటారు?

ఏడెనిమిది సెట్స్‌ వేశాం. అవి చాలా గ్రాండియర్‌గా వుంటాయి. అలాగే ఒక హౌస్‌ సెట్‌ కూడా వేశాం. సెకండాఫ్‌లో 50 నిముషాలు హౌస్‌ సెట్‌లో వుంటుంది. దాని కోసం బాగా వర్కవుట్‌ చేశాం. 

మీకు పర్సనల్‌గా ఎలాంటి మూవీస్‌ చెయ్యాలని వుంటుంది?

ఆర్ట్‌ వున్న ఏ సినిమా అయినా నాకు ఇష్టమే. జనరల్‌గా ఒక రోడ్‌ మీద షూటింగ్‌ జరుగుతుంటే అక్కడ ఆర్ట్‌ డైరెక్టర్‌తో పనేంటి అంటారు. నిజానికి అది చాలా రాంగ్‌. అలా లేనిది ఏ సినిమా అయినా నాకు ఓకే. ఏ సినిమాకైనా ముందు సినిమా బాగుందన్న టాకే ముందు రావాలి. హీరో బాగా చేశాడు, హీరోయిన్‌ డాన్సులు బాగా చేసింది, ఫైట్స్‌ బాగున్నాయి అనే టాక్‌ ఫస్ట్‌ రాకూడదు. సినిమా సూపర్‌హిట్‌ అనే టాక్‌ రావాలి. నెక్స్‌ట్‌ ఏమిటంటే మేం కూడా పనిచేశాం కాబట్టి సినిమా హిట్‌ అయింది. ఆ శాటిస్‌ఫ్యాక్షన్‌ కావాలి. ఆ సక్సెస్‌లో నేను కూడా ఒక పార్ట్‌ అయ్యాను అన్న ఫీలింగ్‌ రావాలి. అది కావాలి నాకు. 

హాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ప్రొడక్షన్‌ డిజైనర్‌ అంటారు, ఇక్కడ ఆర్ట్‌ డైరెక్టర్‌ అంటారు. ఈ డిఫరెన్స్‌ ఎందుకు వచ్చింది?

కెమెరామెన్‌ని, ఎడిటర్‌ని, మ్యూజిక్‌ డైరెక్టర్‌ని పక్కన పెడితే ప్రొడక్షన్‌ డిజైనర్‌ డైరెక్టర్‌ తర్వాత వుంటాడు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ దగ్గర ఒక ఆర్ట్‌ డైరెక్టర్‌ వుంటాడు, మేకప్‌ ఛీఫ్‌ వుంటాడు, కాస్ట్యూమర్‌ వుంటాడు. డైరెక్టర్‌కి ఎక్కువ ప్రెజర్‌ ఇవ్వకుండా హీరోకి ఈ కాస్ట్యూమ్స్‌ అయితే బాగుంటుంది, హీరోయిన్‌ ఇలా వుంటే బాగుంటుంది అని ఫైనల్‌ చేసి డైరెక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తాడు. 

మీకు నచ్చిన ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎవరు?

నేను చదివింది వేరు, పనిచేస్తున్న ఫీల్డ్‌ వేరు. తోట తరణిగారు నాకు బాగా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో మణిరత్నంగారి సినిమాలు, అందులో తరణిగారి వర్క్‌ చూస్తుండేవాడిని. ఆయనంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో నాకు మంచి పరిచయం కూడా వుంది. 

రాజమౌళితో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నారు. మరి బాహుబలి ఎలా మిస్‌ అయ్యారు?

ఆ సినిమాకి నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ అడిగారు. నేను ఇప్పటివరకు 7 సినిమాలు చేశాను. నాలుగు సంవత్సరాలు ఒకటే మూవీ చేసుకుంటే అవ్వదు. బాహుబలి చేసి మళ్ళీ నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని సంవత్సరాలు ఒకే సినిమా చేస్తూ వుంటే చాలా గ్యాప్‌ వస్తుంది. నేను ఫైనాన్షియల్‌గా కూడా సెటిల్‌ అవ్వాలి. అదే కాకుండా ఒకే డైరెక్టర్‌ దగ్గర పనిచేయడం కూడా కరెక్ట్‌ కాదు. అందరు డైరెక్టర్స్‌తో వర్క్‌ చెయ్యాలని నాకు వుంటుంది 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ప్రస్తుతం నాగార్జునగారి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి వర్క్‌ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్‌ వున్నాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌.రవీందర్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ