దుస్తుల షోరూంలను ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ట్రయల్‌రూంలో స్సై కెమెరాలు పెడుతుండటంతో మహిళలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్య సాధారణ మహిళలకే కాకుండా ఏకంగా కేంద్ర క్యాబినెట్ మంత్రికి కూడా ఎదురుకావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. అక్కడ ఉన్న ఫ్యాబ్ ఇండియా షోరూమ్‌లో స్మృతి ఇరానీ దుస్తుల కొనుగోలు కోసం వెళ్లారు. అయితే అక్కడ ట్రయల్ రూంలో దుస్తులు మార్చుకోవడానికి వెళ్లిన ఆమెకు ఊహించని పరిస్థితి ఎదురయ్యింది. అక్కడున్న ట్రయల్‌రూంలో స్పైకెమరాను గుర్తించిన ఆమె అవాక్కయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాబ్ ఇండియాలాంటి ప్రఖ్యాతిగాంచిన షోరూమ్‌ల్లోనే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సాధారణ దుకాణాలను ఎలా నమ్మేది..?