Advertisementt

సుప్రీం కోర్టు జడ్జిల మధ్య తగాదా పెట్టిన గుడ్‌ఫ్రైడే..!!

Fri 03rd Apr 2015 08:47 AM
chief justice datthu,kuriyan joseph,good friday,meeting  సుప్రీం కోర్టు జడ్జిల మధ్య తగాదా పెట్టిన గుడ్‌ఫ్రైడే..!!
సుప్రీం కోర్టు జడ్జిల మధ్య తగాదా పెట్టిన గుడ్‌ఫ్రైడే..!!
Advertisement

అన్ని రకాల తగాదాలకు తీర్పు చెప్పేవారు జడ్జిలు. అందునా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈసారి గుడ్‌ఫ్రైడే వారి మధ్యే తగాదా పెట్టింది. ఇది ఇద్దరు న్యాయమూర్తుల మధ్య లేఖల యుద్ధానికి దారి తీసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఏప్రిల్‌ 3న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌ ఓ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కురియన్‌ జోసెఫ్‌ చీఫ్‌ జస్టీస్‌ దత్తుకు లేఖ రాసినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుడ్‌ఫ్రైడే రోజు సమావేశం నిర్వహించడాన్ని కురియన్‌ జోసెఫ్‌ తీవ్రంగా ఆక్షేపించినట్లు సమాచారం. దసరా, దీపావళి, ఈద్‌ తదితర పండుగ రోజుల్లో కూడా చీఫ్‌ జస్టీస్‌ ఇలాంటి సమావేశాన్ని నిర్వహించేవారా అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారని, ఈ సమావేశానికి తాను హాజరు కాలేనని కూడా చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి ప్రతిగా చీఫ్‌ జస్టీస్‌ దత్తు కూడా లేఖ రాస్తూ.. తాను వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సంస్థాగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది. దేశంలోని అన్ని రకాల వివాదాలను పరిష్కరించాల్సిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య మతపరమైన విషయానికి సంబంధించి విభేదాలు రావడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement