ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకి సత్వర నిధులు, లోటుబడ్జెట్ రాష్ట్ర్రానికి ఆర్ధిక వనరులు తదితర విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడంలేదని కాంగ్రెసు తదితర పక్షాలు గొంతుచించుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాలయిన కర్ణాటక, ఒడిసా, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర తకరారుకి దిగకుండా బిజెపి ఆంధ్రాకి న్యాయం చేయడంలేదు అనే భావన కలిగిస్తూ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, మూడు రోజుల్లో 8,375 కోట్ల నిధి, కర్నూలులో క్షిపణి ప్రయోగ కేంద్రం, హిందూపురంలో కస్టమ్స్ శిక్షణ కేంద్రం, విశాఖలో సమీర్ స్మార్ట్ ఎలక్ట్రానిక్స్, విజయవాడలో జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్యాలయం, తిరుపతిలో ప్రపంచస్థాయి విద్యాసంస్ధలు, ఇండస్ట్రియల్ హబ్స్‌గా నందిగామ - అనంతపూర్, స్మార్ట్ సిటీగా విశాఖ, కృష్ణానదిపై అయిదు వంతెనలు 200 కిలో మీటర్ల ఔటర్ రింగురోడ్డు, రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం, పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ - అన్ని విధాలా చంద్రబాబు ఊహా ప్రపంచానికి రూపం, రంగు, హంగులు సమకూరుస్తోంది మోదీ ప్రభుత్వం. ఇదే సమయంలో అభివృద్ధిరేటులో చైనాని అధిగమించిన భారత్ ఉక్కు ఉత్పత్తిలో చైనాకి గట్టిపోటీ ఇస్తోంది. చైనాని వ్యతిరేకించేవారందరూ భారత్‌ని ప్రోత్సహించి తీరాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు మోదీ. ఈ సమయంలో కావలసింది సంయమనం, కష్టపడేతత్వం, నిజాయితీ, పారదర్శకత, ఎదుటివారిలో విశ్వాసం కల్పించడం అన్నదే ఎన్డీయే ఎజెండా. ఈ సమయంలో నాయకత్వంపట్ల నమ్మకముంచటమే పౌరుల ప్రధమ కర్తవ్యం!