టెన్నిస్ - డబుల్స్‌లో సానియా మీర్జా సాధిస్తున్న విజయాలకు జాతి గర్విస్తోంది. అదే సందర్భంలో బాట్మింటన్‌లో చైనీస్ తైపీలను కాలరాచి ప్రపంచ నెం.1 స్ధానాన్ని కైవసం చేసుకున్న సైనాని చూసి భారత జాతి పులకరిస్తోంది. వరుస పరాజయాలు - వైవాహిక జీవితం గురించి వదంతులతో ఉక్కిరి బిక్కిరయిన సానియాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కెసిఆర్ ప్రకటించిన వేళా విశేషం: టెన్నిస్‌లో రెట్టింపు ఉత్సాహంతో సానియా దూసుకుపోతోంది. ఇప్పుడు సైనా సెహ్వాల్‌కి అటువంటి ప్రోత్సాహం అవసరం. ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరు ముందుగా స్పందిస్తారో చూడాలి. అలాగే శ్రీకాంత్, సింధు, కశ్యప్ తదితరులు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి వివిఎస్ లక్ష్మణ్ సేవలు తీసుకోవాలి. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి వంటి వారు అకాడెమీలు నెలకొల్పడానికి సహకరించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని డీమ్డ్ యూనివర్శిటీలు - కెఎల్‌యు, విజ్ఞాన్, గీతమ్స్ మరియు ఎల్ & టి., ల్యాంకో, జిఎంఆర్, అమర్ రాజా తదితర సంస్థలు చొరవతీసుకొని స్పోర్ట్స్ అకాడమీలు ప్రారంభించాలి. శ్రీయుతులు గంగరాజు, కావూరి, లగడపాటి, పివిపి వంటి వారు చొరవ తీసుకోవాల్సిన సమయమిది. అప్పుడే ఆర్చరీలో రాణించినట్టు తెలుగువారు అన్ని రంగాలలో మెరుస్తారు.
బాట్మింటన్‌లో ప్రపంచ నెం.1 ఖ్యాతిని దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ సైనా సెహ్వాల్‌కి సెల్యూట్ చేద్దాం. గతంలో ఈ ఘనత సాధించిన భారతీయుడు ప్రకాష్ పడుకొణె అందించిన స్ఫూర్తికి జేజేలు పలుకుదాం. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ సింగిల్స్ టైటిల్ గెలిచిన మరో ఆటగాడు శ్రీకాంత్‌కి అభినందనలు.