2009 ఎన్నికల ముందు హీరో రాజశేఖర్ ‘మెగాస్టార్’ చిరంజీవిపైన, బ్లడ్ బ్యాంక్‌పైన విమర్శలు కురిపించారు. తమ అభిమాన నటుడ్ని కించపరిచినందుకు ఆగ్రహించిన చిరంజీవి అభిమానులు రాజశేఖర్ దంపతులు ప్రయాణిస్తున్న కారుని వెంబడిరచడం; రాజశేఖర్ కేసు పెట్టడం జరిగింది. ఇదే సందర్భంగా రాజశేఖర్‌పై చిరంజీవి అనుచరులు పరువునష్టం దావా వేశారు. కాలం గాయాలను మాన్పుతుంది అంటారు. చిరంజీవి సూచనమేరకు మెగాఫ్యాన్య్ పెద్దమనసు చేసుకుని గతానికి తిలోదకాలిచ్చారు. కోర్టు కేసుల ఉపసంహరణ జరిగింది. మున్ముందు చిరంజీవి ఫ్యామిలీ మెంబర్సు తీసే సినిమాలలో రాజశేఖర్‌ని క్యారెక్టర్ యాక్టరుగా చూడగలం. స్క్రిప్టు అనుమతిస్తే చిరంజీవి 150వ సినిమాలో రాజశేఖర్‌ని విలన్‌గానూ చూస్తాం.