Advertisementt

బాబు సింగపూర్‌ పర్యటనను అడ్డుకున్న మోడీ..!!

Thu 26th Mar 2015 02:27 PM
chandra babu naidu,singapoor tour,narendra modi  బాబు సింగపూర్‌ పర్యటనను అడ్డుకున్న మోడీ..!!
బాబు సింగపూర్‌ పర్యటనను అడ్డుకున్న మోడీ..!!
Advertisement
Ads by CJ

సింగపూర్‌పై చంద్రబాబుకున్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ దేశం పేరు తలచకుండా, అక్కడ పర్యటన లేకుండా చంద్రబాబు పాలన సాగద్దన్న విషయం తెలిసిందే. ఇక ఈనెలలో కూడా చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే దీనికి కేంద్ర మంత్రిత్వశాఖ అడ్డుపుల్ల వేసింది. ఇప్పటికే బాబు సింగపూర్‌ పర్యటన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కేంద్రం అభ్యంతరంతోనే బాబు పర్యటన ఆగిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఆ దేశ మాజీ ప్రధాని లీకి నివాళి అర్పించడానికి ఈనెల 29న ప్రధాని మోడీ సింగపూర్‌ వెళ్లనున్నారు. అయితే దేశ ప్రధాని పర్యటనకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిసింగపూర్‌లో పర్యటించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కేంద్ర మంత్రిత్వశాఖ అభ్యంతరం చెప్పింది. అంతకావాలంటే మోడీతోపాటు 29న చంద్రబాబు పర్యటనకు వెళ్లేందుకు అనుమతినివ్వడానికి అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ఇంకా సందిగ్దంలోనే ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ