Advertisementt

అక్రమాస్తుల కేసులో జగన్‌కు కొత్త చిక్కులు..!!

Thu 26th Mar 2015 01:34 PM
jagan mohan reddu,indu,enforcement directorate,seize  అక్రమాస్తుల కేసులో జగన్‌కు కొత్త చిక్కులు..!!
అక్రమాస్తుల కేసులో జగన్‌కు కొత్త చిక్కులు..!!
Advertisement
Ads by CJ

అక్రమాస్తుల కేసులో జగన్‌కు రోజురోజుకూ చిక్కులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పలు ఆస్తులను జప్తు చేయడంతో జగన్‌ పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. ఇక తాజాగా జగన్‌కు సంబంధించిన మరికొన్ని ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ. 130 కోట్లు ఉంటుందని అంచనా. ఇందూ అధినేత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను కూడా క్విడ్‌ప్రో కేసులో ఈడీ జప్తు చేసింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి వద్ద సుమారు 8000 ఎకరాల భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. అయితే ఈ భూములను వెనక్కితీసుకుంటున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కూకట్‌పల్లిలోని చిడ్కో భూములను కూడా ఈడీ జప్తు చేసింది. జగన్‌ కంపెనీల్లో దాదాపు రూ. 70 కోట్ల పెట్టుబడులు పెట్టడంతోనే ఈ భూములను కేటాయించినట్లు ఆరోపణ. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదనే చర్చలు రాజకీయవర్గాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఇక ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఇతర పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ