Advertisementt

చిన్న సినిమాని చంపేస్తున్నది ఆ చిత్రాల దర్శకులే!

Wed 25th Mar 2015 07:59 AM
chinna cinema,small budget movies,big movies,small directors,krr,kodi rama krishna  చిన్న సినిమాని చంపేస్తున్నది ఆ చిత్రాల దర్శకులే!
చిన్న సినిమాని చంపేస్తున్నది ఆ చిత్రాల దర్శకులే!
Advertisement

చిన్న సినిమా - పెద్ద సినిమా అనేది ఆ సినిమా విడుదలయిన మొదటిరోజు ఇంకా చెప్పాలంటే మొదటి ఆట వరకే; చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది అసలు లేనేలేదు - లో బడ్జెట్‌, బిగ్‌ బడ్జెట్‌ సినిమాలు మాత్రమే!

‘మాంగల్యానికి మరో ముడి, ఓ సీత కథ, సిరి సిరి మువ్వ, శంకరాభరణం’ వగైరా తీసిన కె.విశ్వనాధ్‌; ‘జ్యోతి, పెళ్ళి సందడి, పదహారేళ్ళ వయసు’ వగైరా తీసిన కె.రాఘవేంధ్రరావు, ‘స్వర్గం - నరకం, నీడ, తూర్పు పడమర, తాత మనవడు’ వగైరా తీసిన దాసరి, ‘అంతులేని కథ, మరో చరిత్ర’ వగైరా తీసిన బాల చందర్‌, భారతీరాజా - భాగ్యరాజా - విస్సు; టి.కృష్ణ, ‘సాక్షి’ బాపు; ‘పంచాయితీ, కవిత’ విజయ నిర్మల, ఆర్‌.నారాయణమూర్తి, అల్లాణి శ్రీధర్‌, శేఖర్‌ కమ్ముల, ‘మిధునం’ తణికెళ్ళ భరణి వగైరా వగైరా లో-బడ్జెట్‌ చిత్రాల దర్శకులు తొలి దినాలలో విలక్షణమైన సబ్జక్టుని ఎంపిక చేసుకునేవారు; కథే హీరోగా సినిమా తీసేవారు; నిర్మాత బాగోగులు ఆలోచించేవారు. నేటి కొత్త దర్శకులు పెద్ద హీరోల సినిమా కోసం పైలెట్‌ ప్రాజెక్టుగా లో బడ్జెట్‌ చిత్ర నిర్మాత సినిమాని చాలా రిచ్‌గా తీస్తున్నారు. తాను ఎంత రిచ్‌గా తీయగలడో పెద్ద హీరోలకి చూపించడానికి ఈ చిన్న సినిమాని బలిపెడుతున్నారు. రొటీన్‌ కమ్మర్షియల్‌ స్టోరీ, ప్రొడక్షన్‌ కాస్ట్‌ అదిరిపోతోంది. తన సినిమా నిర్మాణవ్యయం - బిజినెస్‌ని బ్యాలెన్సు చేసే దర్శకులను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. కానీ చిన్న సినిమాని బ్రతికించండి - అని గగ్గోలు పెడుతున్నవారు లెక్కకు మిక్కిలిగా వున్నారు. ‘ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య’ సినిమా ప్రారంభించే ముందు కోడి రామకృష్ణ ఎంతో హోంవర్కు చేశారు. ఆ నిజాయితీ నేటి కొత్త దర్శకులలో లేకపోవడం వలనే లో-బడ్జెట్‌ సినిమా బతికి బట్ట  కట్టడంలేదు. కన్నడంలో ‘సంస్కార, వంశవృక్ష, హంసగీతి, ఆది శంకరాచార్య’ వంటి చిత్రాల కథలు - నిర్మాణ వ్యయం మనకు ఆదర్శం! అలాగే బాలచందర్‌, భారతీరాజా, విస్సు, భాగ్యరాజా, దాసరి, విశ్వనాధ్‌, రాఘవేంద్రరావు కథల ఎంపిక అధ్యయనీయం!!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement