‘సూర్య వర్సెస్ సూర్య, జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం, చిరునవ్వుల చిరుజల్లు, అనేకుడు, కాలింగ్ బెల్, డాక్టరు సలీం, టామి, మగ మహారాజు’.
-ఈ సినిమాలలో కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు, దర్శకులు లేరు. ఇంకా చెప్పాలంటే చిరునవ్వుల చిరుజల్లు, అనేకుడు, మగ మహారాజు - డబ్బింగ్ సినిమాలు. ఈ సినిమాలన్నీ విడుదలకు నోచుకోవడం అందునా అద్భుతమైన థియేటర్లలో : పోస్టర్‌పడిన రోజునే పెద్ద హిట్. దీనికితోడు మార్కెట్‌లో పెద్ద హీరోల సినిమాలు లేవు, ఇంటర్ పరీక్షలు పూర్తవుతున్నాయి. మొత్తానికి చిన్న సినిమాలకి పెద్ద పండుగలు ఉగాది, శ్రీరామనవమి కూడా కలిసొచ్చాయి. జాక్‌పాట్ కొట్టేశాయి ఈ సినిమాలన్నీ!!
ఇప్పుడు అడగండి - చిన్న సినిమాకి మనుగడలేదన్నది ఎవరని? ‘శంకరాభరణం, సీతాకోక చిలుక, అహ నా పెళ్లంట, పెళ్లిసందడి’ విడుదలకు ముందు చిన్న సినిమాలే; ఎన్టీఆర్ / రాఘవేంద్రరావు ‘తిరుగులేని మనిషి, సింహబలుడు’ విడుదలకు ముందు పెద్ద సినిమాలే!
అవకాశం చిక్కినప్పుడు ఈ లో-బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల, థియేటర్ యజమానుల, జిల్లా వారీ కొనుగోలుదార్ల ఆలోచనా విధానాన్ని మార్చగలగాలి. ఇప్పుడు అటువంటి అవకాశం దొరికింది. విడుదలకు ముందు చిన్న సినిమా విడుదలయి పెద్ద సినిమాగా మారే సత్తా వీటికి వుందో లేదో తేలిపోతుంది!