తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కేంద్రం తీయ్యని ఉగాది కానుకనిచ్చింది. ఇప్పటికే విద్యుత్ కోతలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలను ఆదుకునే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి ఇచ్చిన 693 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ, ఏపీలసహా కేరళ రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 304 మెగావాట్లు, తెలంగాణకు 222 మెగావాట్లు, కేరళ రాష్ట్రానికి 167 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం కేటాయిందింది. దీంతో తెలంగాణలో విద్యుత్ సమస్య కొంతవరకు తీరినట్లే. కాగా తీవ్ర విద్యుత్ కొరతతో బాధపడుతున్న తెలంగాణ కంటేకూడా ఏపీకి 82 మెగావాట్ల విద్యుత్‌ను అధికంగా కేటాయించడంపై పలువురు తెలంగాణవారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కంటే కూడా ఏపీకి అధిక విద్యుత్‌ను కేటాయించడం కేంద్రం పక్షపాత ధోరణికి నిదర్శనమని, టీ-బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.