Advertisementt

చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారు..!!

Mon 23rd Mar 2015 07:34 AM
chiranjeevi,political career,150 th film,upcoming films  చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారు..!!
చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారు..!!
Advertisement
Ads by CJ

చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ వ్యవహారాలతో అంటీముట్టన్నట్లు వ్యవహిస్తున్న చిరంజీవి ఇక పూర్తిగా రాజకీయాలనుంచి తొలగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన అభిమానులు కూడా ఇదే విషయాన్ని ఆయనకు సూచించి, పూర్తిగా చిత్ర పరిశ్రమపైనే దృష్టిపెట్టాలని సూచించినట్లు తెలిసింది. ఇటీవలే తన ప్రధాన అనుచరగణం, అభిమానులు, అంతరింగుకులతో చిరంజీవి సమావేశమయ్యారు. అక్కడ మెగాస్టార్‌తో సహా అందరూ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారనే అభిప్రాయాన్ని వెల్లడించారని, సినిమాల్లో ఉన్నప్పుడు అభిమానుల్లో ఉన్న ఇమేజ్‌ కూడా రాజకీయాలతో పూర్తిగా డ్యామేజ్‌ అయిందని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగి, తన 150వ సినిమాపై దృష్టి పెట్టనున్న చిరంజీవి చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఇక ఇప్పుడు చిరంజీవి కూడా ఆ పార్టీకి దూరమైతే కాంగ్రెస్‌ పరిస్థితి ఏపీలో పూర్తిగా క్షిణిస్తుందని చెప్పడానికి ఎలాంటి సంశయం అక్కరలేదు. ఇక సాధ్యమైనంత త్వరగా పార్టీ అధిష్టానం చిరంజీవితో మాట్లాడి, ఆయన అభిప్రాయాన్ని మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రస్‌ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ