Advertisementt

నాగార్జున దివాళ తీశారు.. బ్యాంకుల నోటీసులు..!!

Mon 23rd Mar 2015 07:04 AM
nagarjuna,bank notice,loans,land  నాగార్జున దివాళ తీశారు.. బ్యాంకుల నోటీసులు..!!
నాగార్జున దివాళ తీశారు.. బ్యాంకుల నోటీసులు..!!
Advertisement
Ads by CJ

ప్రముఖ టాలీవుడ్‌ హీరో నాగార్జున ఆర్థికంగా దివాళ తీశారా..? బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా తిరిగి చెల్లించే స్థితిలో లేరా..? ఆయన ఆస్తులను బ్యాంకులు వేలం వేయనున్నాయా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తదితర అనుమానాలను రేకిత్తుస్తున్నాయి. హీరో నాగార్జున కుటుంబానికి చెందిన ఏడెకరాల భూమిని వేలం వేయనున్నట్లు ఆంధ్రబ్యాంకు, ఇండియన్‌ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. అన్నపూర్ణ స్టూడియోకు సమీపంలో ఉన్న ఈ భూములను గతంలో ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావుకు ఉచితంగా కేటాయించాయి. ఈ భూములను తనఖా పెట్టి నాగార్జున కుటుంబం ఇండియన్‌, ఆంధ్ర బ్యాంకులనుంచి అప్పులు తీసుకుంది. ప్రస్తుతం ఈ అప్పు రూ. 62కోట్లకు చేరుకుంది. ఇక ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా నాగార్జున స్పందించపోవడంతో ఈ భూమిని వేలం వేయనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఈ భూమిపై ఎలాంటి లావేదేవీలు జరపరాదని స్పష్టం చేశాయి. ఈ మేరకు నాగార్జున, ఆయన బంధువులు అక్కినేని వెంకట్‌, సుప్రియ, వై.సురేంద్ర, నాగ్‌సుశీల, రొడ్డం వెంకట్‌లకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. ఇక ఈ నోటీసులపై నాగార్జున ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ