మిస్టర్ కూల్ దేవినేని ఉమాని చూస్తే ముచ్చటేస్తోంది!
ఆంధ్రా - తెలంగాణ మధ్య ప్రధాన సమస్య : నీళ్ళు - విద్యుత్తు.
తెలంగాణలో హరీష్‌రావు, ఆంధ్రాలో దేవినేని ఉమా నీటిపారుదల శాఖామాత్యులు!
కెసిఆర్ తర్వాత అంతధాటిగా గణాంకాలతో సహా మాట్లాడగలిగిన దిట్ట హరీష్‌రావు. ఆయన చుట్టూ తన శాఖాపరంగా నిష్ణాతులయిన ఇంజినీర్లు, ఐఎఎస్ అధికారులు వుంటారు. ఆంధ్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగల వాక్చమత్కారి!
ఓవైపు హరీష్‌రావుని మరోవైపు జగన్‌ని ఎదుర్కోవలసిన బాధ్యత దేవినేని ఉమాపై పడిరది. పోలవరం ప్రాజెక్టు - పట్టిసీమ ఎత్తిపోతల పథకం - హంద్రినీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు - నాగార్జునసాగర్ మిగులు జలాలు : అన్నీ జఠిల సమస్యలే! సభలోను, పత్రికలవారితోను మాట్లాడేటప్పుడు నీటిమట్టం, వర్షపాతం, ప్రాజెక్టు కాస్ట్, ఏఏ ప్రాంతాలు ఎంతెంత వాడుకునేది - గత చరిత్ర, తాము ఏం చేయబోతున్నదీ పూర్తివివరాలు చేతి వ్రేళ్ళ మీద వుండాలి. సభలో ప్రతిపక్షం, పాత్రికేయ సమావేశంలో పక్షపాత పాత్రికేయం ఎంత రెచ్చగొట్టినా నిబ్బరంగా, నిలకడగా, తొణక్కుండా వారి వాదనలను దేవినేని ఉమా తిప్పికొడుతున్న వైనం అభినందనీయం. మాజీ మంత్రి పార్ధసారధిపై ఒకనాడు దూకుడు ప్రదర్శించిన ఆ వ్యక్తీ ఈ వ్యక్తీ ఒకరేనా అనిపిస్తోంది! బాధ్యతలు మీదపడితే అంతే మరి - అనుకుందాం!
- తోటకూర రఘు