Advertisementt

బిజెపిలో హత్యలుండవు, ఆత్మహత్యలే!

Fri 20th Mar 2015 02:56 PM
bjp,gandhi jayanthi,mahatma,nimala seetharaman,modi,bjp history  బిజెపిలో హత్యలుండవు, ఆత్మహత్యలే!
బిజెపిలో హత్యలుండవు, ఆత్మహత్యలే!
Advertisement
Ads by CJ

గాంధీజయంతినాడు శెలవు రద్దు -

రూపాయినోటుపై గాంధీ బొమ్మ తొలగించాలి -

గాంధీని ‘మహాత్మ’ అనడం మానెయ్యాలి -

గాంధీ తెల్లవాడి ఏజెంట్‌ -

గాడ్సే దేశభక్తుడు.

- ఇలా గాంధీపై గురిపెట్టింది బిజెపి!

గుజరాతీ అయిన గాంధీపై కమలదళం విరుచుకుపడటానికి ప్రధాన కారణం : ‘గాంధీ’ అన్నది భారతీయులకు ఓ ట్రేడ్‌ మార్కు; ‘గాంధీ ఇజం’ పట్ల వున్న అపార నమ్మకం. ఆ నమ్మకాన్ని అమ్మకానికి పెడుతున్నారు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ - అని కమలదళం అక్కసు!

భార్య ఎంత గొప్పగా వంటచేసినా శ్రీవారు అమ్మచేతి రుచినే మెచ్చుకోవడానికి కారణం : ఆ తిండికి అలవాటు పడిపోవడమే! అలాగే ఇంతకాలం గాంధీకి గుండెల్లో గుడికట్టిన భారతీయులు ఒక్కసారిగా గాంధీని తెల్లవాడి ఏజెంట్‌గా జీర్ణించుకోవడం కష్టం.

అలాగే, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు - నిర్మలా సీతారామన్‌ - సుజనా చౌదరి - అశోక్‌ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించడంలోని అవరోధాలను ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పలేకపోయారు. కనీసంలో కనీసంగా రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్రధారి మొయిలీ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను తూర్పార బట్టలేకపోయారు.

మోడీ మొండిచెయ్యి చూపిస్తున్నాడు - అన్న భావన ఆంధ్రులలో బలపడుతోంది. దీనికితోడు సల్మాన్‌ఖాన్‌ - షారుక్‌ ఖాన్‌ - అమీర్‌ ఖాన్‌ : ఖాన్‌ల త్రయం సినిమాలను బహిష్కరించాలని సినీ అభిమానుల గుండెలను గాయపర్చిన సాధ్వీమణులున్నారు బిజెపిలో. ఢల్లీి ఎన్నికల తర్వాత మోడీ పలుకుబడి పలచబడుతోంది! బిజెపి గమనించట్లేదు. అంతే!!

- తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ